For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బొనాంజా: ఆ కంపెనీ ఉద్యోగులకు బంపరాఫర్, నెల శాలరీ అదనం

|

బీజింగ్: చైనీస్ టెలికం దిగ్గజం హువావే ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది. హువావే టెక్నాలజీలో పని చేస్తున్న ఉద్యోగులకు వరాల జల్లు కురిపించింది. ఏకంగా 285 మిలియన్ డాలర్ల బోనస్ ప్రకటించింది. హువావేపై అమెరికా నిషేధాజ్ఞలు విధించినప్పటికీ సిబ్బందికి పెద్ద మొత్తంలో నగదును ఇస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీలో 1.94 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. గత నెలకు గాను వేతనాన్ని వీరికి రెండింతలు అందిస్తోంది. ఈ మేరకు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

రూ.5 బిస్కట్ కూడా కొనడం లేదా?: బ్రిటానియా లాభం రూ.403 కోట్లురూ.5 బిస్కట్ కూడా కొనడం లేదా?: బ్రిటానియా లాభం రూ.403 కోట్లు

అమెరికా నిషేధం.. ప్రత్యామ్నాయంపై హువావే దృష్టి

అమెరికా నిషేధం.. ప్రత్యామ్నాయంపై హువావే దృష్టి

ఆర్ అండ్ డి (పరిశోధన, డెవలప్‌మెంట్) విభాగంలో పని చేస్తున్న సిబ్బందికి నగదు రివార్డును అందిస్తున్నట్లు స్థానిక పత్రిక వెల్లడించింది. ప్రపంచ టెలికం పరికరాల తయారీలో హువావే అగ్రగామి. అమెరికాలో నిషేధం నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రత్యేక సిబ్బందికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీకి చెందిన 5G నెట్ వర్కింగ్‌కు సంబంధించి పరికరాలు భద్రత ప్రమాణాలకు తగినట్లుగా లేవని ఆరోపణలతో అమెరికా వీటిపై నిషేధం విధించింది. కీలక విభాగాల సేల్స్ లేకుండా తగ్గించడంతో హువావే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది.

ఒత్తిడి నేపథ్యంలో పనికి గుర్తింపు

ఒత్తిడి నేపథ్యంలో పనికి గుర్తింపు

అమెరికా నుంచి ఒత్తిడి నేపథ్యంలో ఈ రివార్డ్ వారి పనికి గుర్తింపుగా ఉందని హువావే హ్యూమన్ రిసోర్సెస్ డిపార్టుమెంట్ పేర్కొందట. దాదాపు 1,90,000 మంది ఉద్యోగులకు ఈ నెలలో రెట్టింపు వేతనం రానుంది. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ టీమ్స్‌కు, కంపెనీ సప్లై చైన్ అమెరికా నుంచి షిఫ్ట్ అయ్యే వారికి రివార్డ్స్ ఉంటాయని తెలిపింది. ఉద్యోగులకు బంపరాఫర్ పైన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తొలుత రిపోర్ట్ చేసింది.

హువావే వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ మేకర్

హువావే వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ మేకర్

హువావే వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ మేకర్ కంపెనీ. పరికరాల ఎగుమతుల్లో మూడో క్వార్టర్‌లో 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. కొత్తగా ప్రకటించిన స్టాఫ్ బోనస్ ఒక నెల జీతంతో సమానం. బోనస్ మొత్తం 1.5 బిలియన్ డాలర్లుగా ఉంటుందని భావించినప్పటికీ ఆ తర్వాత 285 మిలియన్ డాలర్లుగా ఉంది.

English summary

బొనాంజా: ఆ కంపెనీ ఉద్యోగులకు బంపరాఫర్, నెల శాలరీ అదనం | Bonanza for employees: Huawei announces $285 mn bonus for coping with US sanctions

Chinese telecom giant Huawei Technologies said on Tuesday it will hand out 2 billion yuan ($286 million) in cash rewards to staff working to help it weather a U.S. trade blacklisting.
Story first published: Wednesday, November 13, 2019, 9:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X