For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీజేపీ కార్పోరేట్ ఫ్రెండ్స్ రోజురోజుకు ధనవంతులవుతున్నారు: ప్రియాంక

|

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూతురు, ఈస్టర్న్ ఉత్తర ప్రదేశ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. దేశంలో కన్స్యూమర్ స్పెండింగ్ కొల్లాప్స్ అయిందని, పేదరికాన్ని ఎదుర్కోవడానికి, ప్రజలను శక్తిమంతంగా చేసేందుకు ప్రభుత్వాలు అవిశ్రాంతంగా కృషి చేశాయని, ఈ ప్రభుత్వం మాత్రం ప్రజలను పేదరికంలోకి నెట్టడం ద్వారా చరిత్ర సృష్టిస్తోందని ట్వీట్ చేసారు.

కేంద్ర ప్రభుత్వ విధానాల యొక్క భయంకరమైన పరిణామాలను గ్రామీణ భారతం ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. అదే సమయంలో బీజేపీ వారి కార్పోరేట్ సన్నిహితులు రోజు రోజుకు ధనవంతులుగా మారుతున్నారని ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా ప్రభుత్వాలు పేదరికం నిర్మూలించే దిశగా పని చేస్తాయని, కానీ డేటాను తొలగించే దిశగా కాదని విమర్శలు గుప్పించారు.

BJP corporate friends become richer by the day: Priyanka Gandhi

కాగా, గత ఏడాది కాలంగా ఆటో పరిశ్రమ, ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైన విషయం తెలిసిందే. అలాగే ప్రజల వినిమయ డిమాండ్ కూడా తగ్గింది. సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. కూరగాయల నుంచి మొదలు ఏవి కొనుగోలు చేసినా జేబులు గుల్ల అవుతున్నాయి. ధరల పెరుగుదల తీరును ప్రతిభింబించే రిటైల్ ద్రవ్యోల్భణం అక్టోబర్ నెలలో 4.62 శాతానికి ఎగబాకింది. ఇది 16 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో ప్రియాంక గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

English summary

బీజేపీ కార్పోరేట్ ఫ్రెండ్స్ రోజురోజుకు ధనవంతులవుతున్నారు: ప్రియాంక | BJP corporate friends become richer by the day: Priyanka Gandhi

Consumer spending in India has collapsed. Successive govts have striven tirelessly to combat poverty and empower the people. This govt is making history by driving people into poverty: while rural India faces the dire consequences of their policies, the BJP ensures that their corporate friends become richer by the day.
Story first published: Friday, November 15, 2019, 16:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X