For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా పతనమై, కాస్త పుంజుకున్న క్రిప్టో, 30,000 డాలర్లు దాటిన బిట్ కాయిన్

|

క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ వ్యాల్యూ 30,000 డాలర్ల పైకి చేరుకుంది. నిన్న ఈ స్థాయి దిగువకు పడిపోయిన ఈ క్రిప్టోకింగ్ నేడు 31వేల డాలర్లు దాటింది. బిట్ కాయిన్ గత నాలుగు వారాల్లో మొదటిసారి ఇటీవల 30వేల డాలర్ల దిగువకు పడిపోయింది. 29,300 డాలర్ల వద్ద ట్రేడ్ అయి, జూన్ 22 తర్వాత మొదటిసారి ఈ స్థాయికి చేరుకుంది. మరుసటి రోజు 30వేల డాలర్లు దాటింది. ఇప్పుడు 32,000 దిశగా సాగుతోంది. మిగతా క్రిప్టో కరెన్సీల కూడా నిన్న పడిపోయాయి. నేడు మాత్రం భారీగా లాభపడ్డాయి.

డోజీకాయిన్, పోల్కాడాట్ 7 శాతం వరకు ఎగిసింది. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాప్ నిన్న 1.95 శాతం దిగజారి, 1.21 ట్రిలియన్ డాలర్లు పడిపోయింది. పదింట ఏడుగురు ఇన్వెస్టర్లు డిజిటల్ అసెట్స్‌లో పెట్టుబడులు పెట్టవచ్చునని సూచిస్తున్నారు. వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ ఇలా ఉంది.

Bitcoin rises above $30,000, Dogecoin gain up to 7 percent

బిట్ కాయిన్ - 31,634 డాలర్లు, ఎథేరియం 1864 డాలర్లు, డోజీ కాయిన్ 0.1799 డాలర్లు, లైట్ కాయిన్ 111.69 డాలర్లు, కార్డానో 1.13 డాలర్లు లాభపడ్డాయి. బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 577.36 బిలియన్ డాలర్లు కాగా, ఎథేరియం మార్కెట్ క్యాప్ 217.71 బిలియన్ డాలర్లు, డోజికాయిన్ మార్కెట్ క్యాప్ 23.46 బిలియన్ డాలర్లుగా ఉంది.

English summary

భారీగా పతనమై, కాస్త పుంజుకున్న క్రిప్టో, 30,000 డాలర్లు దాటిన బిట్ కాయిన్ | Bitcoin rises above $30,000, Dogecoin gain up to 7 percent

Major cryptocurrencies showed strong signs of recovery today after a steep downfall yesterday.
Story first published: Wednesday, July 21, 2021, 21:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X