For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bitcoin Value: 6 వారాల గరిష్టానికి బిట్‌కాయిన్, 40,000 స్థాయికి..

|

క్రిప్టోకరెన్సీ పరుగులు పెడుతోంది. ఇటీవల 30వేల డాలర్ల దిగువకు పడిపోయిన క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ ఇప్పుడు 40వేల డాలర్ల దిశగా పరుగులు పెడుతోంది. బిట్ కాయిన్ నేడు ఒక్కరోజే 15 శాతం ఎగిసి 39,544 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ టోకెన్ 50 రోజుల గరిష్టానికి చేరుకుంటుంది. అంటే దాదాపు ఆరు వారాల గరిష్టానికి చేరుకుంది.

రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథేర్ 7 శాతం లాభపడి 2330 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. డోజీకాయిన్ 9 శాతం లాభపడి 0.20 డాలర్ల స్థాయికి చేరకుంది. XRP, కార్డానో, యూనిస్వాప్, లైట్‌కాయిన్ వంటి డిజిటల్ టోకెన్స్ కూడా 8 శాతం పెరిగింది.

Bitcoin jumps to six week high, trades near $40,000 mark

గతవారం 30వేల డాలర్ల దిగువకు పడిపోయిన బిట్ కాయిన్ మరింత క్షీణించే ప్రమాదం కనిపించింది. అయితే ఆ తర్వాత గతవారం జరిగిన ఓ కార్యక్రమంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మాట్లాడుతూ... బిట్ కాయిన్‌కు సానుకూలంగా మాట్లాడారు. అప్పటి నుండి క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ పెరుగుతోంది.

English summary

Bitcoin Value: 6 వారాల గరిష్టానికి బిట్‌కాయిన్, 40,000 స్థాయికి.. | Bitcoin jumps to six week high, trades near $40,000 mark

World's most popular cryptocurrency bitcoin traded above $40,000 for the first time since June 16. This is the sixth consecutive day that Bitcoin is trading in green.
Story first published: Monday, July 26, 2021, 22:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X