For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

20,000 డాలర్లకు దిగువనే బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ ఇంకా ఆ స్థాయిలోనే

|

క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ నేడు స్వల్పంగా లాభపడినప్పటికీ, 20,000 డాలర్లకు దిగువనే ఉంది. ప్రపంచ క్రిప్టో మార్కెట్ ఆల్ టైమ్ గరిష్టంతో మూడు నుండి నాలుగు రెట్ల క్షీణతతో ఉంది. గత నెల రోజులుగా దాదాపు ఇదే స్థాయిలో కొనసాగుతోంది. ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్టం 69,000 డాలర్లు కాగా, ఇప్పుడు 20,000 డాలర్లకు దిగువనే ఉంది.

నేడు వివిధ క్రిప్టో కరెన్సీ మార్కెట్ విషయానికి వస్తే బిట్ కాయిన్ 2.68 శాతం ఎగిసి 19,515 డాలర్ల వద్ద ఎథేరియం 4.07 శాతం లాభపడి 1088 డాలర్ల వద్ద, బియాన్స్ కాయిన్ 1.70 శాతం లాభపడి 222.97 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఎక్స్‌ఆర్‌పీ మాత్రం స్వల్పంగా 0.25 శాతం క్షీణించింది. బియాన్స్ యూఎస్టీ 0.02 శాతం, సోలానా 4.84 శాతం, కార్డానో 3.14 శాతం, స్టెల్లార్ 2.10 శాతం, అవాలాంచె 3.67 శాతం, చైన్ లింక్ 2.56 శాతం, ట్రోన్ 1.25 శాతం, షిబా ఇను 1.11 శాతం లాభపడింది.

 Bitcoin Holds Above $19K in Weekend Trading

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో న్యూమెరైర్ (17 శాతం), రెన్ (13.42 శాతం), టెర్రా యూఎస్డీ (12 శాతం), ది శాండ్ బాక్స్ (9 శాతం) ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో రిక్వెస్ట్ 10.78 శాతం, ఐఎక్సెక్ ఆర్‌ఎల్‌స 7.25 శాతం, నెమ్ 5.42 శాతం, ఎక్స్‌వైవో నెట్ వర్క్ 3.82 శాతం, కాంపౌండ్ 3.43 శాతం నష్టపోయాయి.

English summary

20,000 డాలర్లకు దిగువనే బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ ఇంకా ఆ స్థాయిలోనే | Bitcoin Holds Above $19K in Weekend Trading

The Monetary Authority of Singapore’s reprimand of the crypto hedge fund for providing misleading information may only be a first step.
Story first published: Monday, July 4, 2022, 19:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X