For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రికార్డ్ గరిష్టం నుండి క్షీణించిన బిట్ కాయిన్, సోలానా మాత్రం 10% జంప్

|

క్రిప్టో కరెన్సీలు నేడు నష్టపోయాయి. మెజార్టీ క్రిప్టోలు నేడు ప్రాఫిట్ బుకింగ్‌ను ఎదుర్కొన్నాయి. బుధ, గురువారాలు క్రిప్టోలు భారీగా లాభపడ్డాయి. బిట్ కాయిన్ ఓ సమయంలో 66వేల డాలర్ల మార్కును క్రాస్ చేసింది. కానీ నేడు ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. రెండు రోజుల క్రితం బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నది. వరల్డ్ లార్జెస్ట్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ నాలుగు శాతం క్షీణించింది. నేడు బిట్ కాయిన్ 62,740 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథేరియం 2 శాతం క్షీణించి 4112 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. డోజీకాయిన్ 3 శాతం తగ్గి 0.24 డాలర్ల వద్ద, షిబా ఇను, బియాన్స్ కాయిన్, లైట్ కాయిన్, యూనిస్వాప్, ఎక్స్‌పీఆర్ కూడా గత 24 గంటల్లో నష్టపోయాయి. సోలానా మాత్రం పది శాతం లాభపడింది.

ప్రస్తుతం బిట్ కాయిన్ 62 వేల డాలర్ల పైన ఉంది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.46 లక్షలకు పైన. బిట్ కాయిన్ మే నెలలో మొదటిసారి 65వేల డాలర్లకు చేరుకొని, ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అప్పుడు లాభపడుతూ వచ్చిన బిట్ కాయిన్, ఆ తర్వాత కొద్ది నెలలపాటు ఊగిసలాటలో ఉంది. ఆ తర్వాత జూలై నెలలో 30,000 డాలర్ల దిగువకు కూడా పడిపోయింది. అక్కడి నుండి స్వల్పంగా లాభపడుతూ కొద్ది నెలల పాటు 30,000 డాలర్ల నుండి 50,000 డాలర్ల మధ్య కదలాడింది. ఈ నెల కాలంలో 50వేల డాలర్లను దాటి, అక్కడి నుండి పరుగులు పెడుతోంది. 55వేల డాలర్లు దాటిన తర్వాత గతవారం సెషన్‌లలోనే 60 వేల మార్కును దాటింది. ఈ వారం 62వేలను దాటి, ఇప్పుడు 66వేల డాలర్లు క్రాస్ చేసి మళ్లీ ఆల్ టైమ్ గరిష్టానికి సమీపంలో నిలిచింది. నిన్న 66వేల డాలర్లను దాటినప్పటికీ, ఆ తర్వాత క్షీణించింది.

Bitcoin falls from record high, ether, other cryptos also plunge

నేటి సెషన్‌లో బిట్ కాయిన్ 2.87 శాతం, ఎథేరియం 0.71 శాతం, బియాన్స్ కాయిన్ 3.41 శాతం, టెథేర్ 0.01 శాతం, ఎక్స్‌ఆర్‌పీ 3.4 శాతం, పోల్కాడాట్ 2.3 శాతం, డోజీకాయిన్ 0.01 శాతం నష్టపోయాయి. కార్డానో 1.82 శాతం, సోలానా 10.16 శాతం, యూఎస్‌డీ కాయిన్ 0.01 శాతం లాభపడ్డాయి.

English summary

రికార్డ్ గరిష్టం నుండి క్షీణించిన బిట్ కాయిన్, సోలానా మాత్రం 10% జంప్ | Bitcoin falls from record high, ether, other cryptos also plunge

Cryptocurrency prices plunged today as Bitcoin declined from its all-time high it had hit two days ago after the debut of the first US bitcoin futures exchange-traded fund.
Story first published: Friday, October 22, 2021, 20:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X