For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

36,000 డాలర్ల దిగువకు పడిపోయిన బిట్ కాయిన్

|

క్రిప్టో కరెన్సీ మార్కెట్ శుక్రవారం క్షీణించింది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ సహా దాదాపు అన్నీ పతనమయ్యాయి. నేటి ప్రారంభంలో డిజిటల్ టోకెన్స్ లాభపడినప్పటికీ, ఆ తర్వాత మాత్రం పడిపోయాయి. బిట్ కాయిన్ గత నవంబర్ నెలలో ఆల్ టైమ్ గరిష్టం 70,000కు చేరుకుంది. అయితే ఇప్పుడు అందులో దాదాపు సగం వద్ద ఉంది. ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 0.55 శాతం క్షీణించి 36,415 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

మిగతా డిజిటల్ టోకెన్స్ విషయానికి వస్తే ఎథేరియం 2.33 శాతం క్షీణించి 2,389 డాలర్లు, ఎక్స్‌పీఆర్ 2.32 శాతం పడిపోయి 0.594626 డాలర్లు, సోలానా 2.83 శాతం తగ్గి 88.35 డాలర్లు, టెర్రా 19.14 శాతం క్షీణించి 49.10 డాలర్లు, కార్డానో 2.85 శాతం తగ్గి 1.02 డాలర్లు, స్టెల్లార్ 2.34 శాతం క్షీణించి 0.191419 డాలర్లు, పోల్కాడాట్ 1.62 శాతం క్షీణించి 17.64 డాలర్లు, డోజీకాయిన్ 2.82 డాలర్లు క్షీణించి 0.138677 డాలర్లు వద్ద ట్రేడ్ అయింది. షిబా ఇను 1.20 శాతం పతనమై 0.000020 వద్ద ట్రేడ్ అయింది.

Bitcoin, Ethereum prices smashes to recent low

అమెరికా ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పోవెల్ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం పసిడి పైన, క్రిప్టో కరెన్సీ పైన పడింది. ఈ క్యాలెండర్ ఏడాదిలో నాలుగుసార్లు వడ్డీ రేట్లు పెంచుతామని ఫెడ్ రిజర్వ్ ప్రకటించింది. వడ్డీ రేట్లు పెంచితే స్టాక్, పసిడి, క్రిప్టో కరెన్సీ క్షీణిస్తుంది. ఎందుకంటే సురక్షిత పెట్టుబడుల కోసం సీనియర్ సిటిజన్స్, ఇతరులు తమ పెట్టుబడులను బ్యాంకులకు మళ్లిస్తారు.

English summary

36,000 డాలర్ల దిగువకు పడిపోయిన బిట్ కాయిన్ | Bitcoin, Ethereum prices smashes to recent low

The cryptocurrency market staged a quick recovery on Friday as traders saw some value at lower levels.
Story first published: Friday, January 28, 2022, 17:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X