For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్ కాయిన్, ఎథేర్ భారీగా జంప్: డోజీకాయిన్ ఏకంగా 12 శాతం ఎగిసింది

|

ఇటీవల క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాప్ భారీగా పతనమవుతోంది. రెండు రోజుల క్రితం క్రిప్టో మార్కెట్ దాదాపు రెండు శాతం మేర పతనమైంది. పోల్కాడాట్ 9.21 శాతం పడిపోయి అత్యంత పతనాన్ని చవిచూసింది. అయితే ఆ తర్వాత మరుసటి రోజు కాస్త పుంజుకున్నాయి. అయితే బిట్ కాయిన్, ఎథేరియం వంటి క్రిప్టో కరెన్సీలు పుంజుకోగా, డోజీకాయిన్ మాత్రం భారీగా లాభపడింది. నేడు బిట్ కాయిన్ కాస్త పుంజుకొని 32,000 డాలర్లు దాటింది. కానీ డోజీకాయిన్ 12 శాతం ఎగిసింది.

బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.29 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. క్రితం రోజుతో పోలిస్తే 1.23 శాతం లాభపడింది. క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ వ్యాల్యూ 32,175 డాలర్ల వద్ద కదలాడింది. క్రిప్టో మార్కెట్లో 46 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉంది. డోజీకాయిన్ 12.88 శాతం ఎగిసింది. పోల్కాడాట్ 8.58 శాతం లాభపడింది.

Bitcoin, Ethereum, Dogecoin Gain after big slump

బిట్ కాయిన్ ధర $32,175.85 వద్ద ఉంది. 24 గంటల్లో 2.57% లాభపడగా, ఏడు రోజుల్లో 4.45% ఎగిసింది. ఎథేరియం 1,975.75 డాలర్ల వద్ద, టెథేర్ 1.00 డాలర్ల వద్ద, బియాన్స్ కాయిన్ 307.83 డాలర్ల వద్ద, కార్డానో 1.21 డాలర్ల వద్ద, ఎక్స్‌ఆర్‌పీ 0.5977 డాలర్ల వద్ద, యూఎస్‌డీ కాయిన్ 1.00 డాలర్ల వద్ద, డోజీకాయిన్ 0.1923 డాలర్ల వద్ద, పోల్కాడాట్ 12.79 డాలర్ల వద్ద, బియాన్స్ యూఎస్‌డీ 1.00 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

English summary

బిట్ కాయిన్, ఎథేర్ భారీగా జంప్: డోజీకాయిన్ ఏకంగా 12 శాతం ఎగిసింది | Bitcoin, Ethereum, Dogecoin Gain after big slump

On July 18, the global cryptocurrency market is up. The market capitalization now stands at $1.30 trillion, up 1.41 percent from the previous day.
Story first published: Sunday, July 18, 2021, 18:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X