For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మళ్లీ నష్టపోయిన బిట్ కాయిన్: 24 గంటల్లో భారీగా లాభపడిన, నష్టపోయిన క్రిప్టోలు

|

గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ గురువారం (డిసెంబర్ 25) స్వల్పంగా తగ్గింది. క్రితం సెషన్‌లో దాదాపు అన్ని క్రిప్టోలు లాభాల్లో ముగిశాయి. కానీ నేడు మిశ్రమంగా కదలాడాయి. క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ నేటి సెషన్‌లో ఊగిసలాటలో కనిపించింది. ఉదయం భారీగా నష్టపోయినప్పటికీ సాయంత్రానికి కాస్త కోలుకొని, 0.39 శాతం లాభంతో ట్రేడ్ అవుతోంది. భారత మార్కెట్‌లో ఈ వార్త రాసే సమయానికి స్వల్ప నష్టాల్లో ఉంది. బిట్ కాయిన్ అంతర్జాతీయ మార్కెట్లో 191 డాలర్లు లాభపడి 48,850 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. భారత మార్కెట్లో రూ.367 క్షీణించి రూ.36,67,853 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.27 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది. గత ఇరవై నాలుగు గంటల్లో 1.17శాతం క్షీణించింది. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ మాత్రం పెరిగింది. టోటల్ వ్యాల్యూమ్ 91.49 బిలియన్ డాలర్లు. గత ఇరవై నాలుగు గంటల్లో 11.66 శాతం. ఎథేరియం కూడా నష్టపోయింది. ఎథేరియం 3,938 డాలర్లకు క్షీణించింది. క్రితం సెషన్‌తో పోలిస్తే 2.29 శాతం క్షీణత.

Bitcoin, Ethereum decline up to 5 percent

గత ఇరవై నాలుగు గంటల్లో భారీగా లాభపడిన క్రిప్టోల్లో
మెల్లో టోకెన్ ఏకంగా 1482 శాతం ఎగిసింది. ఆ తర్వాత డార్ట్ ఇను 340 శాతం, కాయిన్ ప్యాడ్ 330 శాతం, బేబీ క్యాడ్ గర్ల్ 326 శాతం, పప్పీ 250 శాతం, బిస్టల్ ఫైనాన్స్ 182 శాతం ఎగిశాయి.
నష్టపోయిన వాటిలో స్పైస్ డావ్ 100 శాతం నష్టపోయింది. ప్యారట్ డావ్ 99 శాతం, ఆన్ లెక్స్పా 98 శాతం, స్నో బీర్ 92 శాతం, పఫ్ సాంటా 92 శాతం, వోర్టెక్స్ 80.99 శాతం నష్టపోయాయి.

English summary

మళ్లీ నష్టపోయిన బిట్ కాయిన్: 24 గంటల్లో భారీగా లాభపడిన, నష్టపోయిన క్రిప్టోలు | Bitcoin, Ethereum decline up to 5 percent

The cryptocurrency market witnessed some profit booking following a sharp rise over the last few days and ahead of the weekend.
Story first published: Friday, December 24, 2021, 7:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X