For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెజోస్, మస్క్, జుకర్‌బర్గ్ సంపద ఎంత పెరిగిందంటే, చైనీస్ 'జూమ్' జూమ్ అని ఎగిసి..

|

కరోనా మహమ్మారి కాలంలో కుబేరులు మరింత సంపాదించుకున్నారు. 2000 మందికి పైగా బిలియనీర్లు ఈ సంవత్సరం 10 ట్రిలియన్ డాలర్ల సంపదను ఆర్జించినట్లు ప్రముఖ కన్సల్టింగ్ కంపెనీ పీడబ్ల్యుసీ, స్విస్ బ్యాంకు యూబీసీ అధ్యయనంలో వెల్లడైంది. లాక్ డౌన్ సమయంలోను భారీగా ఆర్జించిన వ్యాపారవేత్తల్లో అమెజాన్ జెఫ్ బెజోస్, ఫేస్‌బుక్ జుకర్ బర్గ్, స్పెసెక్స్ ఎలాన్ మస్క్, చైనీస్ ఈ కామర్స్ కంపెనీ పిండౌడో అధినేత కోలిన్ హాంగ్, జూమ్ ఎరిక్ యువాన్ ఉన్నారు.

గుడ్‌న్యూస్... భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది: మూడీస్, వృద్ధి రేటు సవరణగుడ్‌న్యూస్... భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది: మూడీస్, వృద్ధి రేటు సవరణ

జెఫ్ బెజోస్

జెఫ్ బెజోస్

అమెజాన్ అధినేత, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ సంపద అక్టోబర్ 2019 నాటికి 114 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏడాది కాలంలో ఇప్పుడు ఆయన సంపద 184 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇటీవలి కాలంలో అమెజాన్ షేర్ భారీగా జంప్ కావడంతో ఆయన సంపద కూడ ఎగిసింది. ఆగస్ట్ నెలలో బెజోస్ సంపద 200 బిలియన్ డాలర్లు దాటింది. ఆ తర్వాత సాధారణ స్థితికి వచ్చింది.

మార్క్ జుకర్‌బర్గ్

మార్క్ జుకర్‌బర్గ్

ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకులు మార్క్ జుకర్‌బర్గ్ సంపద 2020లో దాదాపు రెండింతలు పెరిగింది. ఏప్రిల్ నెలలో ఆయన సంపద 54.7 బిలియన్ డాలర్లు కాగా, ఇప్పుడు 101.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రపంచంలో 100 బిలియన్ డాలర్ల ఆస్తి కలిగిన నలుగురిలో జుకర్‌బర్గ్ ఒకరిగా నిలిచారు.

ఎలాన్ మస్క్

ఎలాన్ మస్క్

స్పెసెక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంపాదన 2020లో భారీగా ఎగిసింది. గత ఏడాది ఇదే సమయంలో ఆయన నికర ఆస్తి 23.9 బిలియన్ డాలర్లు. ఈ ఏడాది కాలంలో ఆయన ఆస్తి 300 రెట్లు పెరిగింది. టెస్లా స్టాక్ పెరగడంతో ఆయన సంపద పెరిగింది. ప్రస్తుతం ఆయన సంపద 92.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమేకర్‌గా టెస్లా నిలిచింది.

కోలిన్ హాంగ్

కోలిన్ హాంగ్

చైనీస్ ఈ-కామర్స్ కంపెనీ పిండౌడో అధినేత కోలిన్ హాంగ్ చైనాలో నాలుగో ధనవంతుడు. అయితే మిగతా చైనీస్ కుబేరులతో పోలిస్తే ఆయన సంపద వేగంగా పెరిగింది. కరోనా, లాక్ డౌన్ సమయంలో ఈ-కామర్స్ కంపెనీలకు డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. నాస్‌డాక్‌లో లిస్ట్ అయిన ఈ కంపెనీ స్టాక్ కరోనా కాలంలో రెండింతలు పెరిగింది. కోలిన్ హాంగ్ సంపద ప్రస్తుతం 18.2 బిలియన్ డాలర్లుగా ఉంది.

ఎరిక్ యువాన్

ఎరిక్ యువాన్

లాక్ డౌన్ సమయంలో అత్యంత ఎక్కువగా లాభపడిన వారిలో జూమ్ కంపెనీ సీఈవో ఎరిక్ యువాన్ ఉన్నారు. కంపెనీ వినియోగం కరోనా సమయంలో ఏకంగా 1900 శాతం పెరగడం గమనార్హం. దీంతో ఎరిక్ యువాన్ డాలర్ల మేర సంపాదించారు. ప్రస్తుతం ఆయన సంపద 18.2 బిలియన్ డాలర్లుగా ఉంది.

English summary

బెజోస్, మస్క్, జుకర్‌బర్గ్ సంపద ఎంత పెరిగిందంటే, చైనీస్ 'జూమ్' జూమ్ అని ఎగిసి.. | Billionaires rode the coronavirus storm to get even richer

Amid all the doom and gloom, the world’s richest businessmen and women continued to quietly go about doing what they do best: Get richer.
Story first published: Friday, November 13, 2020, 19:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X