For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలాగే ఉంటే: ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్.. ఇద్దరి సంపద కంటే బిల్ గేట్స్ వద్దే ఎక్కువ

|

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎలక్ట్రికల్ కార్ల కంపెనీలో పూర్తిగా వాటాలు అట్టిపెట్టుకోవడం ఇటీవల చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. పన్నుల నుండి తప్పించుకునేందుకు షేర్ల వ్యాల్యూ పెరిగినప్పటికీ, స్టాక్స్‌ను విక్రయించి లాభాలు స్వీకరించడం లేదనే వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ అంశం చర్చకు వస్తోంది. ఎలాన్ మస్క్ వలె... మైక్రోసాఫ్ట్‌లో తన స్టాక్స్ అన్నింటిని అట్టిపెట్టుకుంటే బిల్ గేట్స్ ఇప్పుడు ప్రపంచ కుబేరుడు కావడంతో పాటు ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల జాబితాలో ఉన్న ఒకటి, రెండు స్థానాల కంటే ఎక్కువ మొత్తం ఆయన వద్ద ఉండేదని చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ కార్ప్‌లో బిల్ గేట్స్ స్టాక్స్ అలాగే ఉంటే ఎలాన్ మస్క్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్.. ఈ ఇద్దరి సంపద కంటే ఆయన వద్ద ఎక్కువగా ఉండేది.

ప్రపంచ సాఫ్టువేర్ దిగ్గజం 1998లో వరల్డ్ మోస్ట్ వ్యాల్యుబుల్ కంపెనీగా నిలిచింది. అప్పుడు బిల్ గేట్స్ వద్ద 2.06 బిలియన్ డాలర్ల షేర్లు ఉన్నాయి. మళ్లీ ఇటీవలే అక్టోబర్ 29న మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆపిల్ ఇంక్‌ను దాటి ప్రపంచ నెంబర్ వన్ కంపెనీగా నిలిచింది. అంటే బిల్ గేట్స్ వద్ద 1998 నాటి 2.06 బిలియన్ డాలర్ల షేర్లు అలాగే ఉంటే కనుక ప్రస్తుతం ఆయన సంద 693 బిలియన్ డాలర్లుగా ఉండేది. ఎలాన్ మస్క్ సంపద ఇప్పుడు 340.4 బిలియన్ డాలర్లు. జెఫ్ బెజోస్ నెట్ వర్త్ 200.3 బిలియన్ డాలర్లు. వీరిద్దరి నెట్ వర్త్ కలిసినా (340+200) 540 బిలియన్ డాలర్లు మాత్రమే అవుతుంది. అంటే ప్రస్తుతం బిల్ గేట్స్ షేర్లు అలాగే ఉంటే, వీరిద్దరి సంపద కంటే ఎక్కువగా ఉండేది. 2020లో మైక్రోసాఫ్ట్ బోర్డు నుండి తప్పుకునే సమయంలో ఆయన మెజార్టీ షేర్లను విక్రయించారు.

Bill Gates Might Have Been Richer Than Musk, Bezos Combined If hanging onto Microsoft

2020లో మైక్రోసాఫ్ట్ బోర్డు నుండి వైదొలిగిన సందర్భంగా బిల్‌గేట్స్ ఆయన ఖాతాలోని మెజార్టీ వాటాలను విక్రయించారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరఫున నిర్వహిస్తున్న దాతృత్వ కార్యక్రమాలపై దృష్టి సారించేందుకే వైదొలుగుతున్నట్లు అప్పుడు ప్రకటించారు. ఆ తర్వాత ఆయనపై చాలా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన తన భార్య మిలిందా గేట్స్‌కు విడాకులు ఇచ్చారు. స్పేస్ఎక్స్, టెస్లాతో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ సంపాదించుకున్నారు. ప్రస్తుతం అత్యంత ధనవంతుల జాబితాలో ఆయన తొలి స్థానంలో ఉన్నారు. ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా అవతరించే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది.

English summary

అలాగే ఉంటే: ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్.. ఇద్దరి సంపద కంటే బిల్ గేట్స్ వద్దే ఎక్కువ | Bill Gates Might Have Been Richer Than Musk, Bezos Combined If hanging onto Microsoft

Bill Gates might have ended up richer than Elon Musk and Jeff Bezos combined by hanging onto Microsoft Corp. rather than selling.
Story first published: Tuesday, November 9, 2021, 21:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X