For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మైక్రోసాఫ్ట్‌కు బిల్ గేట్స్ రాజీనామా, వారెన్ బఫెట్ కంపెనీ నుండి కూడా... కారణమిదే

|

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ బాధ్యతల నుండి తప్పుకున్నారు. కంపెనీ బోర్డు నుండి తప్పుకొని పూర్తిగా దాతృత్వ కార్యకలాపాలపై దృష్టి సారించనున్నారు. తాను ప్రపంచ ఆరోగ్యం, అభివృద్ధి, వాతావరణ మార్పులు పైనే తన దృష్టిని కేంద్రీకరించనున్నట్లు చెప్పారు. బిల్ గేట్స్ ప్రపంచంలోని టాప్ 5 కుబేరుల్లో ఒకరు. అతని వయస్సు 65. మైక్రోసాఫ్ట్ నుండి మాత్రమే కాదు వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్‌వే బోర్డు మెంబర్‌గా కూడా తప్పుకుంటున్నారు.

70 రోజుల్లోనే ముఖేష్ అంబానీ సంపద రూ.1.11 లక్షల కోట్లు ఢమాల్70 రోజుల్లోనే ముఖేష్ అంబానీ సంపద రూ.1.11 లక్షల కోట్లు ఢమాల్

సమాజం కోసమే ఇక జీవితం

సమాజం కోసమే ఇక జీవితం

తనకు మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా ఎంతో ముఖ్యమని, దీని కోసం కూడా సమయం కేటాయిస్తానని బిల్ గేట్స్ చెప్పారు. తన జీవితాన్ని సమాజం కోసం ఉపయోగిస్తానని తెలిపారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బిల్ గేట్స్ ప్రపంచంలో రెండో అతిపెద్ద కుబేరుడు. మొదటి స్థానంలో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ఉన్నారు.

ఇలా పదవుల నుండి తప్పుకున్నారు...

ఇలా పదవుల నుండి తప్పుకున్నారు...

బిల్ గేట్స్ 35 ఏళ్ల క్రితం 1975లో మైక్రోసాఫ్ట్‌ను స్థాపించారు. తాను స్థాపించిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్‌కు పూర్తి కాలం వినియోగించేందుకు మైక్రోసాఫ్ట్‌లో 2008 జూన్ 28న తన బాధ్యతల నుండి తప్పుకున్నారు. అంతకుముందు 2000 సంవత్సరం వరకు సీఈవోగా కొనసాగారు. 2014లో బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తన ఆస్తిలో ఎక్కువగా దాతృత్వ సేవలకు వినియోగిస్తారు.

ఇప్పుడు బోర్డు నుండి కూడా..

ఇప్పుడు బోర్డు నుండి కూడా..

తాజాగా బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సంస్థకు 202 మార్చి 14న రాజీనామా చేశారు. ఇప్పటి వరకు బోర్డు సభ్యుడిగా ఉన్న ఆయన ఆ పదవి నుండి కూడా తప్పుకున్నారు. సలహాదారుగా కొనసాగుతారు. ఆయన తప్పుకోవడంతో మైక్రోసాఫ్ట్ బోర్డులో 12 మంది ఉంటారు. కాగా, మైక్రోసాఫ్ట్ సీఈవోగా భారతీయ సంతతి సత్య నాదెళ్ల ఉన్న విషయం తెలిసిందే.

English summary

మైక్రోసాఫ్ట్‌కు బిల్ గేట్స్ రాజీనామా, వారెన్ బఫెట్ కంపెనీ నుండి కూడా... కారణమిదే | Bill Gates is leaving Microsoft and Berkshire Hathaway's boards

Microsoft co-founder Bill Gates is stepping down from the company's board to spend more time on philanthropic activities.
Story first published: Saturday, March 14, 2020, 7:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X