బిల్ గేట్స్ సహా వీరి మాట! బిట్ కాయిన్ మరింత పతనం? 20,000 డాలర్లకు పడిపోవచ్చు
మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ పైన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. బిట్ కాయిన్ అంతకంతకూ కొలాప్స్ కావడం తప్పనిసరి అని, ఇప్పటికే గత వారం ఈ క్రిప్టోకరెన్సీ 15 శాతాని కంటే పైన పడిపోయిందని గుర్తు చేస్తున్నారు. ఏప్రిల్ 14వ తేదీన 64000 డాలర్లు దాటిన బిట్ కాయిన్ ఆ తర్వాత దారుణంగా పతనమైంది. ప్రధానంగా టర్కీ క్రిప్టోకరెన్సీకి షాకివ్వడంతో పతనమైంది. ప్రస్తుతం బిట్ కాయిన్ సహా ఇతర క్రిప్టో వ్యాల్యూ కాస్త స్టడీగా ఉన్నప్పటికీ గత వారం గరిష్టంతో పోలిస్తే 12 శాతం తక్కువగా ఉన్నాయి.

పతనం కావొచ్చు
స్టాక్ మార్కెట్ అనలిసిస్ యూట్యూబ్ ఛానల్ MHFIN ప్రకారం 'బిల్ గేట్స్: ది బిట్ కాయిన్ పానిక్ ఆఫ్ 2021' అనే వీడియోలో ఇలా ఉంది. దీని ప్రకారం గేట్స్ కొంతకాలంగా క్రిప్టోకరెన్సీ గురించి మాట్లాడుతున్నారు. అతని అంతగా ఆసక్తిగా లేరని తెలుస్తోంది. ఎందుకంటే అతను బిట్ కాయిన్ పట్ల నిరాశావాదంతో ఉన్నారని, ఈ క్రిప్టోకరెన్సీ పతనమవుతుందని భావిస్తున్నారని తెలుస్తోంది.

20వేల డాలర్లకు పడిపోవచ్చు
బిట్ కాయిన్ ప్రస్తుతం ఉన్న వ్యాల్యూ నుండి మరో 50 శాతం పడిపోయే అవకాశాలు లేకపోలేదని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గుగెన్‌హిమ్‌కు చెందిన స్టాట్ మినెర్డ్ అన్నారు. దీని వ్యాల్యూ 20వేల డాలర్ల నుండి 30వేల డాలర్లకు కూడా పడిపోవచ్చునని అంటున్నారు. బిట్ కాయిన్ ఇటీవల 64వేలు క్రాస్ చేసి 65వేల డాలర్ల సమీపానికి చేరుకుంది. లాంగ్ టర్మ్‌లో మాత్రం ఇది భారీగా ఎగిసిపడవచ్చునని, 6,00,000 డాలర్లకు చేరుకోవచ్చునని చెబుతున్నారు.

55వేల డాలర్ల వద్ద ట్రేడింగ్
బిట్ కాయిన్ బుధవారం 55,500 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత వారం గరిష్టం 65వేల డాలర్లతో ఇది దాదాపు 10వేల డాలర్లు తక్కువ. క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్ బేస్ ఇటీవల నాస్‌డాక్‌లో లిస్ట్ అయింది. ప్రస్తుతం ఉన్న వ్యాల్యూ నుండి మరింత క్షీణించవచ్చునని మార్కెట్ నిపుణుల అంచనా.