For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

146 బిలియన్ డాలర్ల సంపద: బిల్ గేట్స్-మెలిందా ఆస్తులపై ఎలా?

|

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, బిల్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్, ఆయన సతీమణి మెలిందా గేట్స్ విడాకులు తీసుకుంటున్నారు. 27 సంవత్సరాల వైవాహిక జీవితానికి స్వస్తీ పలుకుతూ సోమవారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా వీరిద్దరు విడాకులకు సంబంధించిన విషయం ప్రకటించారు. ఎన్నో సమాలోచనలు, మధనం అనంతరం తమ వైవాహిక బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నామని, గత ఇరవై ఏడేళ్లులో తాము ముగ్గురు అద్భుతమైన పిల్లలను తీర్చిదిద్దామని, అలాగే తమ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి సహకరించామని, ఇందులో తమ భాగస్వామ్యం కొనసాగుతుందని, కానీ భార్యాభర్తలుగా కొనసాగలేమని తెలిపారు.

146 బిలియన్ డాలర్ల సంపద

146 బిలియన్ డాలర్ల సంపద

బిల్ గేట్స్, మెలిందాకు ఇద్దరికీ కలిపి 146 బిలియన్ డాలర్ల సంపద ఉంటుందని అంచనా. బ్లూమ్‍‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం వీరి ఆస్తులు ఈ మేరకు ఉంటాయి. విడాకుల గురించి ప్రస్తావించిన బిల్ గేట్స్ దంపతులు తమ ఆర్థిక సంబంధమైన ప్రణాళికల గురించి వెల్లడించలేదు. అయితే దాతృత్వ సంస్థ బిల్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ కోసం మాత్రం ఇరువురం కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. బిల్ గేట్స్ వయస్సు 65. మెలిందా వయస్సు 56. వీరు తమ ఫౌండేషన్ కోసం 50 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేశారు.

ఆ సంస్థల్లో వాటా

ఆ సంస్థల్లో వాటా

గతంలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్-మెకంజీ విడాకులు సంచలనం సృష్టించాయి. ఇప్పుడు బిల్ గేట్స్-మెలిందా విడాకులు ఫిలాంత్రపిక్ ప్రపంచానికి షాకిచ్చాయి. బిల్ గేట్స్ అంటే మైక్రోసాఫ్ట్ గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం ఇందులో గేట్స్ ఆస్తుల వ్యాల్యూ 20 శాతం వరకు ఉండవచ్చు. గత ఏడాది మైక్రోసాఫ్ట్ బోర్డు నుండి బయటకు వచ్చిన తర్వాత అతని స్టేక్ గురించిన వివరాలు పూర్తిగా వెల్లడికాలేదు. గేట్స్ అతిపెద్ద అసెట్ కాస్కాడ్ ఇన్వెస్ట్‌మెంట్. కాస్కాడ్‌తో పాటు రియల్ ఎస్టేట్, ఎనర్జీ, హాస్పిటాలిటీపై బిల్ గేట్స్‌కు ఆసక్తి ఉంది. అలాగే కెనడియన్ నేషనల్ రైల్వే అండ్ డీర్ అండ్ కంపెనీ వంటి డజన్ల కొద్ది ప్రభుత్వ సంస్థల్లో వాటా ఉంది.

నాలుగో స్థానంలో గేట్స్

నాలుగో స్థానంలో గేట్స్

గత ఫిబ్రవరి నాటికి బిల్ గేట్స్ సంపద 137 బిలియన్ డాలర్లు. గేట్స్ ఫౌండేషన్ కోసం 53 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు పేట్టారు. ప్రపంచ కుబేరుల్లో బిల్ గేట్స్ నాలుగో స్థానంలో ఉన్నారు. బిల్ గేట్స్ దంపతులు దాతృత్వకార్యకలాపాలపై దృష్టిసారించి, తమ ఫౌండేషన్‌కు కేటాయించడంతో ఇదే కాలంలో ఇతర కంపెనీల మార్కెట్ వ్యాల్యూ భారీగా పెరిగింది. ప్రస్తుతం అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, లూయిస్ విటన్ అధినేత బెర్నార్డ్ అర్నాల్డ్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు.

English summary

146 బిలియన్ డాలర్ల సంపద: బిల్ గేట్స్-మెలిందా ఆస్తులపై ఎలా? | Bill and Melinda Gates to divorce with $146 billion at stake

Bill and Melinda Gates, who for decades have overseen one of history's greatest fortunes and philanthropic operations, said they plan to divorce.
Story first published: Tuesday, May 4, 2021, 19:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X