For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జంటగా ముందుకెళ్లలేం: బిల్‌గేట్స్-మెలిందా విడాకులు, ఫిలాంత్రపిక్ ప్రపంచానికి షాక్

|

ఫిలాంత్రపిక్ ప్రపంచానికి న్యూస్. బిల్‌గేట్స్, మెలిందా విడిపోనున్నారనే వార్తలు అంతా షేక్ చేస్తోంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తన భార్య మెలిందా గేట్స్‌తో విడిపోనున్నారు. ఈ మేరకు తాము విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఇరువురు సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 'ఒక జంటగా తాము ముందుకు వెళ్లగలమని అనిపించడం లేద'ని ఓ ప్రకటనలో తెలిపారు. తమ బంధం గురించి చాలా లోతుగా ఆలోచించిన తర్వాతే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

ఇక జంటగా ముందుకెళ్లలేం

ఇక జంటగా ముందుకెళ్లలేం

27 ఏళ్లుగా తాము ముగ్గురు పిల్లలను పెంచి పోషించామని, ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్యం, మెరుగైన జీవితాన్ని అందించే అద్భుతమైన సంస్థను స్థాపించామని, ఈ మిషన్‌పై తమ భాగస్వామ్యం కొనసాగుతుందని, ఇక ముందు కూడా ఫౌండేషన్ కోసం పని చేస్తామని బిల్ గేట్స్, మెలిందా గేట్స్ పేర్కొన్నారు. అయితే తమ తదుపరి జీవితం దశలో మాత్రం మే ఒక జంటగా ముందుకు వెళ్లలేమని తమకు అనిపించిందన్నారు. కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు వీలుగా, తమ వ్యక్తిగత ఆకాంక్షలను, తమ విడాకుల నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తామని పేర్కొన్నారు.

అప్పుడే తొలిసారి కలిశారు

అప్పుడే తొలిసారి కలిశారు

బిల్ గేట్స్ 1970వ దశకంలో మైక్రోసాఫ్ట్‌ను స్థాపించారు. బిల్ గేట్స్ - మెలిందా 1980 దశకంలో మైక్రోసాఫ్ట్‌లో కలిశారు. మెలిందా ఈ కంపెనీలో చేరినప్పుడు తొలిసారి కలిశారు. బిల్ గేట్స్ వయస్సు 65. మెలిందా వయస్సు 56. బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్న సమయంలో మెలిందా ప్రోడక్డ్ మేనేజర్‌గా చేరారు. అప్పుడు కంపెనీలో చేరిన ఎంబీయే గ్రాడ్యుయేట్లలో ఏకైక మహిళ.

1994లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ పేరుతో స్వచ్చంధ సంస్థను నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వ్యాధులకు, చికిత్స, చిన్నారుల వ్యాక్సినేషన్, చదువుల కోసం ఎంతో ఖర్చు చేశారు. గివింగ్ ప్లెడ్జ్ వెనుక బిల్-మెలిందాతో పాటు వారెన్ బఫెట్ చొరవ ఉంది.

137 బిలియన్ డాలర్లు

137 బిలియన్ డాలర్లు

గత ఫిబ్రవరి నాటికి బిల్ గేట్స్ ఆస్తులు 137 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. ప్రపంచ సంపన్నుల్లో నాలుగో స్థానంలో ఉన్నారు. హార్వార్డ్ యూనివర్సిటీలో చేరిన గేట్స్ మధ్యలో చదువును ఆపేశారు. 1975లో స్కూల్ ఫ్రెండ్ పాల్ అలెన్‌తో కలిసి మైక్రోసాఫ్ట్‌ను ప్రారంభించారు. 1986లో ఐపీవోకు వచ్చిన సమయంలో మైక్రోసాఫ్ట్‌లో బిల్ గేట్స్ వాటా 49 శాతం. బిల్ గేట్స్-మెలిందాలు 200లో బిల్-మెలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రారంభించారు. ఈ కాలంలో 5 బిలియన్ డాలర్ల మొత్తాన్ని ధార్మిక కార్యకలాపాలకు ఖర్చు చేశారు.

English summary

జంటగా ముందుకెళ్లలేం: బిల్‌గేట్స్-మెలిందా విడాకులు, ఫిలాంత్రపిక్ ప్రపంచానికి షాక్ | Bill and Melinda Gates file for divorce, shaking philanthropic world

Billionaire benefactors Bill and Melinda Gates, co-founders of one of the world's largest private charitable foundations, filed for divorce on Monday after 27 years of marriage, saying they had reached an agreement on how to divide their assets.
Story first published: Tuesday, May 4, 2021, 14:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X