For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ వాట్సాప్ చూసుకోండి... పాలసీ డెలివరీ అయింది...

|

మెసేజింగ్, వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవడానికి లక్షలాది మంది వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఫోన్ లోను ఈ యాప్ తప్పనిసరిగా ఉంటోంది. దీని వినియోగం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు కూడా తమ సర్వీసుల కోసం వాట్సప్ ను వినియోగించుకుంటున్నాయి.

భారతీ అక్సా..

భారతీ అక్సా..

ఇటీవలే భారతీ అక్సా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా వాట్సాప్ సర్వీసులను వినియోగించుకోవడం ప్రారంభించింది. ఇందులో భాగంగా బీమా పాలసీలను వాట్సాప్ ద్వారా కస్టమర్లకు డెలివరీ చేయడం ప్రారంభించింది. రెన్యూవల్ ప్రీమియం ను కూడా వాట్సాప్ ద్వారానే పంపించనుంది.

త్వరలో కొత్త సర్వీసులు

త్వరలో కొత్త సర్వీసులు

భారతీ అక్సా కంపెనీ త్వరలోనే ప్రైవేట్ కార్, టూ వీలర్, ట్రావెల్ ఇన్సూరెన్స్ ను కూడా వాట్సాప్ చాట్ బాట్ ద్వారా అందించాలని సన్నాహాలు చేస్తోంది. వాట్సప్ చాట్ బాట్ ద్వారా మొత్తం సర్వీసులను (పాలసీ డాక్యుమెంట్లు, రెన్యువల్ నోటీసులు, క్లెయిమ్ సమాచారం) అందిస్తున్న మొదటి నాన్ లైఫ్ జీవిత బీమా కంపెనీ ఇదే కావడం విశేషం. చాట్ బాట్ ద్వారా పాలసీ డాక్యుమెంట్లు, రెన్యూవల్ నోటీసులు పొందడానికే కాకుండా మోటార్ క్లెయిమ్స్ రిజిస్టర్ తో పాటు క్లెయిమ్ స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు.

అదనంగా కొత్త సర్వీస్

అదనంగా కొత్త సర్వీస్

వాట్సప్ ద్వారా వేగవంతంగా సర్వీసులు అందించడానికి అవకాశం ఉంటుంది. అనేక మంది ఎప్పటికప్పుడు తమ వాట్సాప్ ను చెక్ చేసుకుంటారు. కాబట్టి పాలసీ వివరాలు త్వరగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెన్యూవల్ వివరాలు కూడా గుర్తుంచుకోవడం సులభమే. ఇప్పటికే ఈ కంపెనీ తన నెట్ వర్క్ శాఖలు, కస్టమర్ కేర్, కాంటాక్ట్ సెంటర్, పోర్టల్ ద్వారా సర్వీసులు అందిస్తోంది. ఇప్పుడు వాట్సాప్ చాట్ బాట్ ద్వారా అదనంగా కొత్త సర్వీస్ వచ్చి చేరినట్లయింది.

ఇప్పటికే కొన్ని కంపెనీలు

ఇప్పటికే కొన్ని కంపెనీలు

ఇప్పటికే పాలసీ బజార్ డాట్ కామ్ తన వెబ్ సైట్ ద్వారా వివిధ రకాల పాలసీలను కొనుగోలు చేసే వారికీ వాట్సప్ ద్వారా బీమా పాలసీ డాక్యుమెంట్ ను డెలివరీ చేస్తోంది. పాలసీలో ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ వాట్సాప్ ఉంటె ఆ నెంబర్ కు ఈ వివరాలు అందుతాయి. ఇలాంటి సదుపాయం ద్వారా కంపెనీలపై వ్యయాలు కూడా తగ్గుతాయి. పాలసీ డాక్యుమెంట్లను ముద్రించడం, వాటిని కస్టమర్ కు పంపించడం వంటివి ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే కంపెనీలు టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇప్పటికే కంపెనీలు కస్టమర్ల ఈ మెయిల్ కు పాలసీల వివరాలు, డాక్యుమెంట్ కు సంబంధించిన సాఫ్ట్ కాపీలను పంపుతున్నాయి.

English summary

మీ వాట్సాప్ చూసుకోండి... పాలసీ డెలివరీ అయింది... | Bharti AXA General uses WhatsApp to deliver policy and renewal documents

Bharti AXA General Insurance has started delivering policies and renewal premium to its customers through messaging platform WhatsApp.
Story first published: Saturday, February 29, 2020, 11:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X