For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

BharatPe: సంచలన విషయాలు బయటపెట్టిన అష్నీర్ గ్రోవర్.. భారత్ పేలో ఏం జరుగుతోంది..?

|

BharatPe: డిజిటల్ చెల్లింపుల ఫిన్ టెక్ సంస్థ భారత్ పే దేశవ్యాప్తంగా తక్కువ కాలంలోనే చాలా మంచి గుర్తింపును పొందింది. దీనికి గతంలో ఎండీ హోదాలో పనిచేసిన అష్నీర్ గ్రోవర్ కంపెనీ నుంచి కొన్ని వివాదాల నడుమ 2022 మార్చిలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన వెళ్లిన తర్వాత కంపెనీ యాజమాన్యంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. తాజాగా జనవరి 3, 2023న సీఈవో సుహైల్ సమీర్ కంపెనీని వీడారు.

అష్నీర్ లేఖ..

అష్నీర్ లేఖ..

కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో తనను బెదిరించారని ఆరోపిస్తూ అష్నీర్ గ్రోవర్ BharatPe కంపెనీ బోర్డుకు ఒక లేఖ పంపారు. ఆయన ఈ లేఖను డిసెంబర్ 31, 2022న పంపటం జరిగింది. దీని తర్వాత సీఈవో రాజీనామా కూడా జరిగింది. సమావేశంలో కంపెనీ లాయర్ తనను బెదిరించారని భారత్‌పే మాజీ ఎండీ గ్రోవర్ పేర్కొన్నారు. అప్పటి సమావేశంలో కంపెనీ ఛైర్మన్ రజనీష్ కుమార్ తో పాటు ఇతర ఇన్వెస్టర్లు కూడా ఉన్నట్లు గ్రోవర్ వెల్లడించారు. కంపెనీని నడుపుతున్న వ్యక్తులు ఎంత సీరియస్‌గా పనిచేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతోందని అష్నీర్ గ్రోవర్ తన లేఖలో రాయటంపై దుమారం మెుదలైంది.

కంపెనీలో వాటాలు..

కంపెనీలో వాటాలు..

315 కోట్ల విలువైన 7880 ఈక్విటీ షేర్లను కంపెనీకి చెందిన నలుగురు ముఖ్యమైన అధికారులకు ఇచ్చినట్లు గ్రోవర్ తన లేఖలో వెల్లడించారు. వీరిలో ఛైర్మన్ రజనీష్ కుమార్, వ్యవస్థాపకుడు శాశ్వత్ నక్రానీ, కంపెనీ సీఈవో పదవికి రాజీనామా చేసిన సుహైల్ సమీర్, జనరల్ కౌన్సెల్ సుమిత్ సింగ్ ఉన్నారు. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ కింద ఈ షేర్లు ఇవ్వబడ్డాయి.

కావాలని ప్లాన్ చేసి..

కావాలని ప్లాన్ చేసి..

ఏజీఎం నిర్వహించిన రోజున ఛైర్మెన్‌గా ఉన్న సుమీత్ సమావేశాన్ని పక్షపాతంతో నిర్వహించారని గ్రోవర్ తన లాజా లేఖలో వెల్లడించారు. నీ సంగటి బయట చూస్తానంటూ తనను బెదిరించారని గ్రోవర్ చెప్పారు. సరిగ్గా ఫిబ్రవరి 2022లో ఇలాగే రజనీష్ కుమార్ తనను భావిక్ కొలాడియా ద్వారా బెదిరించారని చెప్పారు. పైగా ఆరోజు నిర్వహించిన ఏజీఎంలో కంపెనీ ఆర్థిక పరిస్థితికి సంబంధించి అడిగిన ప్రశ్నలకు ఎలాంచి సమాధానం ఇవ్వలేదని గ్రోవర్ స్పష్టం చేశారు.

మీటింగ్ మేనేజ్ మెంట్..

మీటింగ్ మేనేజ్ మెంట్..

ఏజీఎం సమావేశంలో రజనీష్ కుమార్ చైర్మన్ బాధ్యతలను శాశ్వత్ నక్రానీకి అప్పగించగా.. అతడు సమావేశానికి అధ్యక్షత వహించే బాధ్యతను జనరల్ న్యాయవాది సుమిత్ సింగ్‌కు అప్పగించినట్లు గ్రోవర్ వెల్లడించారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగినట్లు కనిపిస్తోంది. సుహైల్ సమీర్‌కు తెలిసిన కంపెనీ లేదా వ్యక్తి నుంచి భారత్‌పే రూ.60 కోట్ల రుణాన్ని తీసుకుందని అష్నీర్ గ్రోవర్ ఆరోపించారు. దీనిని గడువుకు ముందుగా చెల్లించటంపై ఆడిట్ వివరాలను గ్రోవర్ అడిగినట్లు లేఖలో తెలిపారు.

కంపెనీ సమాధానం..

కంపెనీ సమాధానం..

దీనిపై ప్రముఖ వార్తా సంస్థ మనీకంట్రోల్ కంపెనీకి ఈ-మెయిల్ పంపగా భారత్‌పే బదులిచ్చింది. నిబంధనల ప్రకారం డిసెంబర్ 31న కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగిందని వెల్లడించింది. గ్రోవర్ కుటుంబం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని.. గ్రోవర్ కంపెనీ ప్రతినిధులను బెదిరించే ప్రయత్నం చేశారని భారత్ పే సమాధానం ఇచ్చింది. దీంతో అసలు కంపెనీలో ఏం జరుగుతోందనే ఆసక్తి అందరిలో నెలకొంది. పైగా కంపెనీ ఆర్థిక పరిస్థితిపై కూడా కొందరు ఈ వార్తల నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English summary

BharatPe: సంచలన విషయాలు బయటపెట్టిన అష్నీర్ గ్రోవర్.. భారత్ పేలో ఏం జరుగుతోంది..? | BharatPe Ex MD Ashneer Grover Wrote letter to board saying he was threatened in AGM

BharatPe Ex MD Ashneer Grover Wrote letter to board saying he was threatened in AGM
Story first published: Wednesday, January 4, 2023, 10:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X