For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.1,200 కోట్ల విలువైన ఇంటిని కొనుగోలు చేసిన అమెజాన్ సీఈవో, జెఫ్ బెజోస్

|

ప్రపంచ కుబేరుడు, అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ బెజోస్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. లాస్ ఏంజెల్స్‌లోని బెవర్లీ హిల్స్ ప్రాంతంలోని మీడియా మొఘల్ డేవిడ్ గెఫెన్‌కు చెందిన వార్నర్ ఎస్టేట్‌ను రికార్డ్ ధర 165 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో ఈ ధర ఒక రికార్డ్. భారత కరెన్సీలో దీని విలువ రూ.1,180 కోట్లు.

ఆరేళ్ల తర్వాత గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు: హైదరాబాద్‌లో ఎంత, రాయితీ ఎంత వస్తుందంటే?ఆరేళ్ల తర్వాత గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు: హైదరాబాద్‌లో ఎంత, రాయితీ ఎంత వస్తుందంటే?

ఆ రికార్డ్ తుడిచేసిన జెఫ్ బెజోస్

ఆ రికార్డ్ తుడిచేసిన జెఫ్ బెజోస్

ఇప్పటి వరకు లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో ఉన్న రికార్డ్‌ను అమెజాన్ సీఈవో తుడిచి వేశారు. గతంలో మీడియా ఎగ్జిక్యూటివ్ లచ్లాన్ ముర్దోక్ ఈ ప్రాంతం బెల్ ఎయిర్ ఎస్టేట్‌లో గల క్లెంపెట్ రెసిడెన్స్‌ను 150 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లుగా చెబుతారు. దీనిని ఓ టెలివిజన్ షో కోసం కొనుగోలు చేశాడు. ఇప్పుడు జెఫ్ బెజోస్ 165 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు.

వార్నర్ బ్రదర్స్ నుండి..

వార్నర్ బ్రదర్స్ నుండి..

డేవిడ్ గెఫెన్ 1990లో 9.4 ఎకరాలు (3.8 హెక్టార్లు) భూమిని 47.5 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు. దీనిని వార్నర్ బ్రదర్స్‌లలో ఒకరైన జాక్ వార్నర్ నుండి కొనుగోలు చేశారు. వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్‌ను వీరు 1937లో స్థాపించారు.

కొంతకాలంగా కొత్త ఇంటి కోసం వెతుకుతున్న జెఫ్

కొంతకాలంగా కొత్త ఇంటి కోసం వెతుకుతున్న జెఫ్

అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఆస్తులు 131 బిలియన్ డాలర్లుగా ఇటీవల ఫోర్బ్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. భారత కరెన్సీలో దీని విలువ రూ.9,30,100 కోట్లు. జెఫ్ గత కొంతకాలంగా కొత్త ఇంటి కోసం వెతుకుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు దీనిని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

English summary

రూ.1,200 కోట్ల విలువైన ఇంటిని కొనుగోలు చేసిన అమెజాన్ సీఈవో, జెఫ్ బెజోస్ | Bezos buys Warner Estate in Beverly Hills for record dollar 165 million

Amazon Chief Executive Jeff Bezos, the world's wealthiest person, has bought the Warner Estate in Beverly Hills from media mogul David Geffen for $165 million.
Story first published: Thursday, February 13, 2020, 14:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X