For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అరగంట నిద్రించండి: ఉద్యోగులకు ఈ బెంగళూరు స్టార్టప్ అదిరిపోయే ఆఫర్

|

ప్రస్తుతం ఉద్యోగాలు చాలా ఒత్తిడితో కూడుకున్నవి. పని ఒత్తిడి కారణంగా నిద్రలేమి కూడా ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు మానసిక ఒత్తిడిని తగ్గించే వివిధ మార్గాలు అన్వేషిస్తున్నాయి.

తాజాగా బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ ఉద్యోగుల కోసం అదిరిపోయే నిర్ణయాన్ని తీసుకుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు పని... పని అంటూ తీవ్ర ఒత్తిడి ఉంటుంది. దీంతో ఉద్యోగులు కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారు. కొంతమంది కాస్త విరామం దొరికితే కునుకు తీసి, రీఫ్రెష్ అవుదామని భావిస్తారు.

 Bengaluru start up will now allow 30 minute official nap breaks for employees

అలాంటి వారి కోసం బెంగళూరులోని స్టార్టప్ ఊరటను కల్పించింది. వేక్ ఫిట్ సొల్యూషన్స్ అనే స్టార్టప్ మధ్యాహ్నం 30 నిమిషాలు కునుకు తీయడానికి ఉద్యోగులకు అవకాశమించ్చింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. ఉద్యోగులు మధ్యాహ్నం గం.2 నుండి గం.2.30 వరకు కునుకు తీసే వెసులుబాటు కల్పించింది. నాసా అధ్యయనం ప్రకారం మధ్యాహ్నం 26 నిమిషాలు కునుకు తీస్తే ఆ ఉద్యోగి సామర్థ్యం 33 శాతం పెరుగుతుందని వెల్లడైంది.

గత ఆరేళ్లుగా వేక్ ఫిట్ పరుపులు, తలగడలు తయారు చేసే వ్యాపారంలో ఉంది. వేక్ ఫిట్ కో-ఫౌండర్ రామలింగగౌడ మాట్లాడుతూ తాము గత ఆరేళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నామని, ఉద్యోగులకు విశ్రాంతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని, మేం ఎల్లప్పుడు నిద్రను సీరియస్‌గా తీసుకుంటామని చెప్పారు.

English summary

అరగంట నిద్రించండి: ఉద్యోగులకు ఈ బెంగళూరు స్టార్టప్ అదిరిపోయే ఆఫర్ | Bengaluru start up will now allow 30 minute official nap breaks for employees

A Bengaluru based startup called Wakefit will now allow its staff to take 30 minute naps at work, under the ‘Right to Nap’ policy.
Story first published: Sunday, May 8, 2022, 9:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X