For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కుప్పకూలిన భారత వృద్ధి, కరోనా మాత్రమే కారణంకాదు..!

|

2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో భారత్ జీడీపీ ఏకంగా 23.9 శాతం ప్రతికూలతను నమోదు చేసింది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా దెబ్బతిన్న మొదటి 11 దేశాల్లో భారత్ ముందుంది. మిగతా దేశాలతో పోలిస్తే భారత్ తీవ్రంగా దెబ్బతిన్నది. ఇందుకు కరోనా మహమ్మారిని కారణంగా చూపించినప్పటికీ ఇతర కారణాలు కూడా ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

<strong>SBI ఉద్యోగులకు వీఆర్ఎస్ స్కీం, 30,000 మంది ఔట్!! పథకం వివరాలివీ...</strong>SBI ఉద్యోగులకు వీఆర్ఎస్ స్కీం, 30,000 మంది ఔట్!! పథకం వివరాలివీ...

నోట్లరద్దు, జీఎస్టీ, ఆర్థిక మందగమనం,

నోట్లరద్దు, జీఎస్టీ, ఆర్థిక మందగమనం,

జీడీపీ వృద్ధిరేటు ఘోరంగా పడిపోయినట్లు కేంద్ర స్టాటిస్టిక్స్ మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. త్రైమాసిక జీడీపీ ఫలితాలను 1996 నుండి విడుదల చేస్తుండగా, ఇప్పటివరకు ఎప్పుడూ లేనంతగా ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో జీడీపీ 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసింది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని చెబుతున్నప్పటికీ, ప్రభుత్వం గతంలో తీసుకున్న చర్యల ప్రభావంకూడా పడిందని అంటున్నారు. నాలుగేళ్ల క్రితం చేసిన నోట్ల రద్దు, మరుసటి ఏడాది తెచ్చిన జీఎస్టీ కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగిందని, ఆ ప్రభావం 2019-20లో కనిపించిందని గుర్తు చేస్తున్నారు. దీనికి కరోనా మహమ్మారి తోడు కావడం ఆర్థిక వ్యవస్థ చితికిపోవడానికి కారణమైందని చెబుతున్నారు.

అన్ని దేశాల్లోకెల్లా భారత్ దారుణం

అన్ని దేశాల్లోకెల్లా భారత్ దారుణం

మన దేశ జీడీపీ కంటే అమెరికా జీడీపీ భారీగా పడిపోయిందని చెబుతున్నారు. కానీ ఏడాది త్రైమాసికం నాటికి అమెరికా జీడీపీ 9.1 క్షీణతను నమోదు చేయగా, భారత్ జీడీపీ 23.9 ప్రతికూలతను నమోదు చేసింది. చైనా వృద్ధిరేటును 3.2 శాతం, రష్యా 8.2 శాతం ప్రతికూలతను నమోదు చేశాయి. స్పెయిన్ 22.1 శాతం ప్రతికూలతను నమోదు చేసింది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో భారత్ ఆర్థిక వ్యవస్థనే తీవ్రంగా పతనమైంది.

వృద్ధి రేటు ఇలా..

వృద్ధి రేటు ఇలా..

ముఖ్య ఆర్థిక వ్యవస్థల విషయానికి వస్తే భారత్ మైనస్ 23.9 శాతం, స్పెయిన్ మైనస్ 22.1 శాతం, యూకే మైనస్ 21.7 శాతం, ఫ్రాన్స్ మైనస్ 18.9 శాతం, ఇటలీ మైనస్ 17.7 శాతం, కెనడా మైనస్ 13 శాతం, జపాన్ మైనస్ 9.9 శాతం, టర్కీ మైనస్ 9.9 శాతం, అమెరికా మైనస్ 9.1 శాతం, రష్యా మైనస్ 8.5 శాతంతో ఉన్నాయి. చైనా మాత్రమే ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో 3.2 శాతం మేర వృద్ధిని నమోదు చేసింది. భారత జీడీపీ 2017-18 నుండి క్రమంగా పెరిగి, 2018-19 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ నుండి క్రమంగా తగ్గుతూ వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్‌లో 3.2 శాతం నమోదయింది.

English summary

కుప్పకూలిన భారత వృద్ధి, కరోనా మాత్రమే కారణంకాదు..! | Behind India's GDP shrinks more than other major economies

On Monday, data released by the Ministry of Statistics and Programme Implementation showed that India’s Gross Domestic Product growth rate had contracted by 23.9% for the April to June quarter.
Story first published: Saturday, September 5, 2020, 11:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X