For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Cheque New Rules: చెక్కు రూల్స్ మారాయి.. అలా చేయకపోతే చెక్కులు రిజెక్ట్ అవుతాయి.. ఎప్పటి నుంచి అమలులోకంటే..

|

Cheque New Rules: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా చెక్కుల రూల్స్ మార్చింది. ఇకపై ఆగస్టు 1, 2022 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) కస్టమర్లకు ఇప్పుడు రూ. 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన చెక్కుల చెల్లింపులకు పాజిటివ్ పే సిస్టం తప్పనిసరి. చెక్ మోసాలను నిరోధించడానికి తీసుకొచ్చిన తాజా ప్రక్రియ ప్రకారం.. చెల్లింపుకు ముందు అథెంటికేషన్ కోసం కస్టమర్లు కీలకమైన చెక్ వివరాలను డిజిటల్‌గా ధృవీకరించాల్సి ఉంటుంది.

చెల్లింపు చేయకుండానే వెనక్కు..

చెక్కుల లావాదేవీల విషయంలో తీసుకొస్తున్న మార్పుల గురించి బ్యాంక్ ఆఫ్ బరోడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వినియోగదారులకు సమాచారం అందించింది. 01.08.2022 నుంచి అమలులోకి వచ్చే నిబంధనల ప్రాకారం వినియోగదారుడు చెల్లింపు నిర్థారణ అందించకపోతే.. పేమెంట్ చేయకుండానే క్లియరింగ్ హౌస్ కు తిరిగి ఇవ్వబడతాయని బ్యాంక్ స్పష్టం చేసింది.

 ప్రాసెసింగ్ సులువుగా..

ప్రాసెసింగ్ సులువుగా..

బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు చెక్కులను లబ్ధిదారులకు అందజేయడానికి ముందే ముఖ్య విషయాలు అందించాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల వారు ఇచ్చిన చెక్కులు చెల్లింపుల కోసం క్లియరింగ్‌కి వెళ్లినప్పుడు రూ.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన చెక్కులను పాస్ చేయటం కుదురుతుంది. ఈ ప్రక్రియలో బేస్ బ్రాంచ్ ద్వారా ఎలాంటి రీ కన్ఫర్మేషన్ ఫోన్ కాల్ లేకుండానే ప్రక్రియ పూర్తి అవుతుంది.

పాజిటివ్ పే సిస్టమ్ అంటే ఏమిటి?

పాజిటివ్ పే సిస్టమ్ అంటే ఏమిటి?

పాజిటివ్ పే అనేది చెక్ క్లియరింగ్ సిస్టమ్‌లో ఒక భాగం. దీని కింద చెక్కును జారీ చేసే సమయంలో ఖాతాదారు పంపిన సమాచారం ఆధారంగా డ్రాయీ బ్యాంక్ ద్వారా చెల్లింపు కోసం చెక్కులు ప్రాసెస్ చేయబడతాయి. పాజిటివ్ పే సిస్టమ్‌లో చెక్కుకు సంబంధించిన కీలక వివరాలను డ్రాయర్(చెక్కు ఇష్యు చేసిన వ్యక్తి) ద్వారా బ్యాంక్‌కి తిరిగి ధృవీకరించడం ఉంటుంది. ఇది చెల్లింపు, ప్రాసెసింగ్ సమయంలో సమర్పించిన చెక్కుతో క్రాస్-చెక్ చేయబడుతుంది.

చెల్లింపు నిర్ధారణ కోసం అందించాల్సిన 6 పాయింట్లు..

చెల్లింపు నిర్ధారణ కోసం అందించాల్సిన 6 పాయింట్లు..

1. చెక్కు తేదీ

2. చెల్లింపుదారు పేరు

3. అమౌంట్

4. అకౌంట్ నంబర్

5. చెక్కు నంబర్

6. ట్రాన్సాక్షన్ కోడ్

CTS క్లియరింగ్‌లో సమర్పించిన చెక్కు వివరాలు అందించిన ఆరు వివరాలు సరిపోలితే.. చెక్కు ఆమోదించబడుతుంది. లేని పక్షంలో ప్రాసెసింగ్ సమయంలో చెక్కు వెనక్కి పంపటం జరుగుతుంది. దీనివల్ల చెల్లింపు తిరస్కరించబడుతుంది.

English summary

Cheque New Rules: చెక్కు రూల్స్ మారాయి.. అలా చేయకపోతే చెక్కులు రిజెక్ట్ అవుతాయి.. ఎప్పటి నుంచి అమలులోకంటే.. | bank of baroda new cheque rules comes into force from august 1st know details

KNOW ABOUT THE BANK OF BARODA NEW CHEQUE RULE WHICH WILL BE IMPLEMENTED FROM AUGUST 1st..
Story first published: Thursday, July 7, 2022, 16:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X