For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Interest Rates: వడ్డీ రేట్లను పెంచిన రెండు బ్యాంక్స్.. భారంగా మారనున్న లోన్స్.. కొత్త రేట్ల వివరాలు..

|

Interest Rates: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు తమ MCLR రేట్లను 0.10 శాతం వరకు పెంచాయి. దీని వల్ల రుణాలు తీసుకున్న వినియోగదారులకు ఖర్చు పెరగనుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ MCLR రేట్లను 0.10 శాతం వరకు సవరించింది. దీనితో వినియోగదారుల రుణాలు శనివారం నుండి ఖరీదైనవిగా మారాయి.

 ఖరీదైన లోన్స్ వివరాలు..

ఖరీదైన లోన్స్ వివరాలు..

బెంచ్‌మార్క్ ఒక సంవత్సరం MCLR ప్రస్తుతం ఉన్న 7.65 శాతం నుంచి 7.75 శాతానికి సవరించబడింది. ఇది కార్ లోన్, పర్సనల్ లోన్, హోమ్ లోన్ తీసుకున్న వారిపై ప్రభావం చూపుతుంది. రెండు, మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్‌లను ఇదే మార్జిన్‌తో ఒక్కొక్కటి 7.80 శాతానికి పెంచారు.

IOB వెల్లడి..

IOB వెల్లడి..

మిగతా వాటితో పాటు.. ఓవర్‌నైట్ MCLR రేటు 7.05 శాతం, ఒక నెల 7.15 శాతం. మూడు, ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌లు ఒక్కొక్కటి 7.70 శాతం చొప్పున పెరిగాయి. సవరించిన MCLRలు సెప్టెంబర్ 10, 2022 నుంచి అమలులోకి వచ్చినట్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా..

బ్యాంక్ ఆఫ్ బరోడా..

బ్యాంక్ ఆఫ్ బరోడా ఏడాది MCLR రేటు 7.70 శాతం నుంచి 7.80 శాతానికి మారినట్లు బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 7.55 శాతం నుంచి 7.65 శాతానికి పెరగనుంది. మిగతా వాటితో పాటు.. మూడు నెలల MCLR 7.45 శాతంతో పోలిస్తే 7.50 శాతంగా ఉంటుంది. కొత్త రేట్లు సెప్టెంబర్ 12, 2022 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ ఆఫ్ బరోడా స్పష్టం చేసింది.

English summary

Interest Rates: వడ్డీ రేట్లను పెంచిన రెండు బ్యాంక్స్.. భారంగా మారనున్న లోన్స్.. కొత్త రేట్ల వివరాలు.. | bank of baroda, iob banks changed their mclr rates causing burden over loan customers

bank of baroda, iob banks changed their mclr rates causing burden over loan customers
Story first published: Sunday, September 11, 2022, 17:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X