For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కస్టమర్లకు CSB బ్యాంకు గుడ్‌న్యూస్, వడ్డీ రేటు తగ్గింపు

|

కస్టమర్లకు సీఎస్‌బీ బ్యాంకు గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 1వ తేదీ నుండి వివిధ బ్యాంకుల పలు రూల్స్ మారాయి. అదేవిధంగా సీఎస్‌బీ బ్యాంకు కస్టమర్లకు వడ్డీ రేటు తగ్గిస్తూ బహుమతి ఇచ్చింది. వడ్డీ రేటు తగ్గింపు నేపథ్యంలో ఈఎంఐ తగ్గుతుంది. సీఎస్‌బీ బ్యాంకు ఎంసీఎల్ఆర్ వడ్డీ రేటును 0.10 శాతం తగ్గించింది. ఇది ఆరు నెలల కాలపరిమితిలోని రుణాలకు వర్తిస్తుంది. ఇది రుణగ్రహీతలకు ఎంతో ప్రయోజనం.

నేటి నుండి RTGS కొత్త టైమింగ్స్! ఎంత ట్రాన్సుఫర్ చేస్తే ఎంత ఛార్జ్నేటి నుండి RTGS కొత్త టైమింగ్స్! ఎంత ట్రాన్సుఫర్ చేస్తే ఎంత ఛార్జ్

డిసెంబర్ 1 నుండి కొత్త వడ్డీ రేట్లు అమలు

డిసెంబర్ 1 నుండి కొత్త వడ్డీ రేట్లు అమలు

తగ్గించిన వడ్డీ రేట్ల ప్రయోజనం డిసెంబర్ 1వ తేదీ నుండి అమలులోకి వస్తుందని సీఎస్‌బీ బ్యాంకు తన ప్రకటనలో తెలిపింది. ఈ ప్రయోజనం 6 నెలల రుణ కాలపరిమితిపై అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. అయితే ఏడాది కాల పరిమితి రుణాలపై ఎలాంటి మార్పు లేదని తెలిపింది. సీఎస్‌బీ బ్యాంకు ప్రకటన ప్రకారం ఒకరోజు నుండి ఆరు నెలల కాలపరిమితిపై ఎంసీఎల్ఆర్ 0.10 శాతం తగ్గింది. మార్జినల్ కాస్ట్ బేస్డ్ ఇంటరెస్ట్ రేట్ (MCLR) వడ్డీ రేట్లు 7.70 శాతం నుండి 8.50 శాతం మధ్య ఉన్నాయి. ఏడాది కాల పరిమితిపై ఇంతకుముందు ఉన్నట్లు 9.50 శాతం ఉంటుంది.

కాలపరిమితి.. వడ్డీ రేటు

కాలపరిమితి.. వడ్డీ రేటు

సీఎస్‌బీ బ్యాంకు వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.. ఎంసీఎల్ఆర్‌పై ఒకరోజు వడ్డీ రేటు 7.70 శాతం, నెల రోజుల కాలపరిమితికి 7.80 శాతం, మూడు నెలల కాలపరిమితిపై 8.10 శాతం, ఆరు నెలల కాలపరిమితిపై 8.50 శాతం ఉంది. ఏడాది కాలపరిమితిపై గతంలో 9.50 శాతం ఉండగా, ఇప్పుడు అదే కొనసాగుతుంది.

వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు తగ్గింపు

వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు తగ్గింపు

ఇటీవలి కాలంలో వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లను తగ్గించాయి. పలు బ్యాంకులు ఏడాది కాలపరిమితిపై కూడా వడ్డీ రేట్లను తగ్గించాయి. సీఎస్‌బీ బ్యాంకు ఇటీవల ఐపీవోకు వచ్చింది. ఈ బ్యాంకు కార్యకలాపాలు ప్రధానంగా కేరళలో ఉంటాయి. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలోను సేవలు అందిస్తోంది.

English summary

కస్టమర్లకు CSB బ్యాంకు గుడ్‌న్యూస్, వడ్డీ రేటు తగ్గింపు | Bank gave gift: CSB BANK reduced EMI on loan

On the first day of the last month of the year, where there have been many changes in the rules of the banks, the bank account holders have also received the gift.
Story first published: Wednesday, December 2, 2020, 8:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X