For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తలసరి ఆదాయంలో భారత్‌ను అధిగమించిన బంగ్లాదేశ్

|

తలసరి ఆదాయంలో సాంకేతికంగా భారత్‌ను సహచర బంగ్లాదేశ్ అధిగమించింది. నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ తలసరి ఆదాయం 2020-21 ఆర్థిక ఏడాదిలో 2,227 డాలర్లుగా నమోదయింది. అంతకుముందు ఏడాది అంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో 2,064 డాలర్లుగా ఉంది. అంటే గత ఆర్థిక సంవత్సరం బంగ్లాదేశ్ తలసరి ఆదాయం తొమ్మిది శాతం మేరకు పెరిగింది. అదే సమయంలో భారత్ తలసరి ఆదాయం 1,947.417 డాలర్లుగా ఉంది. కరోనా వైరస్ మహమ్మారి, గత ఏడాది సుదీర్ఘ లాక్ డౌన్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో తలసరి క్షీణించింది.

ఇదీ తలసరి ఆదాయం

ఇదీ తలసరి ఆదాయం

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీన్ నేతృత్వంలో జరిగిన వర్చువల్ కేబినెట్ సమావేశంలో ప్లానింగ్ మినిస్టర్ ఎంఏ మన్నన్ డేటాను ప్రవేశపెట్టారు. ఈ నివేదిక ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో పర్ క్యాపిడా ఇన్‌కం 2,227 డాలర్లుగా ఉంది. అంతకుముందు సంవత్సరం 2,064 డాలర్లుగా నమోదయింది. తలసరి ఆదాయం ఈ ఏడాది కాలంలో 9 శాతం పెరిగినట్లు వెల్లడించారు.

ఆర్థిక నిపుణుల మాట

ఆర్థిక నిపుణుల మాట

ఇది కేవలం తాత్కాలిక అంశమని, బంగ్లాదేశ్ లేబర్ ఇంటెన్సివ్ ఎగుమతులు ఎక్కువగా కలిగినదని, ఇది ఎక్కువ కాలం ఇదే వృద్ధిని కొనసాగించడం సాధ్యం కాకపోవచ్చునని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భారత్ కంటే వేగంగా వృద్ధి ఉండకపోవచ్చునని, ఒకసారి కరోనా తగ్గుముఖం పడితే వృద్ధిలో మార్పులు ఉంటాయని, కరోనా నేపథ్యంలో కొన్ని పాలసీలతో భారత్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడిందని చెబుతున్నారు. ప్రజల ప్రాణాలకు విలువనిచ్చి గత ఏడాది ప్రపంచంలోనే సుదీర్ఘ లాక్ డౌన్ పెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం చూపిన విషయం తెలిసిందే.

మానీటరీ ఫండ్

మానీటరీ ఫండ్

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గత ఏడాది అక్టోబర్ నెలలో విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ ఔట్ లుక్ డేటా ప్రకారం బంగ్లాదేశ్ తలసరి ఆదాయంలో భారత్‌ను వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసింది. ఫార్మర్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణియన్ మాట్లాడుతూ ఈ రెండు దేశాల వృద్ధి డేటాలను పోల్చలేమన్నారు.

English summary

తలసరి ఆదాయంలో భారత్‌ను అధిగమించిన బంగ్లాదేశ్ | Bangladesh beats India in per capita income

India has technically slipped below Bangladesh in terms of per capita income as the neighbouring country reported its per capita income at $2,227 in the financial year 2020-21— over 9 per cent jump from $2,064 in 2019-20. Latest official data show that India’s per capita income reached $1,947.417, thanks to the sharp contraction in the economic growth due to Covid-19 pandemic and the subseqent nationwide lockdown.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X