For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Hyderabad: బీజింగ్ కు గట్టిపోటీనిస్తున్న బెంగుళూరు.. అదరకొడుతున్న హైదరాబాద్.. కొత్త కొలువులతో..

|

Bangalore: గ్లోబల్ టెక్ ట్రేడ్ మార్కెట్‌లో చైనాలోని బీజింగ్ తర్వాత ఆసియా-పసిఫిక్‌లోని టాప్ టెక్ హబ్‌లలో బెంగళూరు ఒకటిగా నిలిచింది. కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక ప్రకారం.. అధిక నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్, నాణ్యమైన ఆఫీస్ స్పేస్ కోసం దేశీయ, మల్టీనేషనల్ కంపెనీల నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీలు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖంగా ఉన్నాయి.

టాప్ టెక్ మార్కెట్లలో..

టాప్ టెక్ మార్కెట్లలో..

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 115కి పైగా టెక్ సిటీల నుంచి 46 టాప్ టెక్ మార్కెట్లు గుర్తించబడ్డాయి. అందులోని ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉన్న 14 నగరాల్లో ఆరు భారతీయ నగరాలు కావటం విషేషం. టెక్ కంపెనీలకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన మానవవనరులు అందుబాటులో ఉండటం దీనికి కారణాలుగా ఉన్నాయి.

కొత్త ఉద్యోగాల కల్పన..

కొత్త ఉద్యోగాల కల్పన..

గత ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ రంగంలో 5,00,000 ఉద్యోగాలు సృష్టించబడ్డాయని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ రిపోర్ట్ తెలిపింది. భారత్‌లో ఐటీ సేవల రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందనటానికి ఇదే సూచికని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే క్రమంలో గత కొంత కాలంగా కంపెనీలు ఫ్రెషర్లను భారీగా రిక్రూట్ చేసుకుంటున్నాయి.

హైదరాబాద్ నగరంలో..

హైదరాబాద్ నగరంలో..

జాతీయ సగటు 35%తో పోలిస్తే.. బెంగళూరు టెక్నాలజీ రంగం సగటు వాటా 38%-40%గా ఉందని నివేదిక వెల్లడించింది. మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్‌లకు నిలయమైన హైదరాబాద్‌లో జాతీయ స్థాయిలో 44 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్ తరువాత దక్షిణ భారతంలో చెన్నై అతిపెద్ద డేటా సెంటర్ మార్కెట్‌గా మారింది.

ఆసియా పసిఫిక్ మార్కెట్..

ఆసియా పసిఫిక్ మార్కెట్..

టాలెంట్, ఆఫీస్ రియల్ ఎస్టేట్, వ్యాపార వాతావరణం పరంగా ఒక్క ఆసియా పసిఫిక్ మార్కెట్‌లోనే ప్రపంచవ్యాప్తంగా 14 టెక్ సిటీలు ఉన్నాయని అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెన్సీ తెలిపింది. ఈ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున గ్రేడ్- A కార్యాలయ ప్రాజెక్టులు లక్షలాది మంది ఉద్యోగులను నియమించుకుంటున్నాయని తన నివేదికలో వెల్లడించింది. ఈ కారణాల వల్ల అంతర్జాతీయ టెక్ కంపెనీలు భారత మార్కెట్లకు వస్తున్నాయని.. కరోనా నుంచి మార్కెట్లు త్వరగా కోలుకున్నట్లు తెలిపింది. రానున్న కాలంలో ఈ మార్కెట్లపై బులిష్ వ్యూను అవి ఉంచాయి.

Read more about: bangalore hyderabad
English summary

Hyderabad: బీజింగ్ కు గట్టిపోటీనిస్తున్న బెంగుళూరు.. అదరకొడుతున్న హైదరాబాద్.. కొత్త కొలువులతో.. | bangalore, hyderabad ranked among top 5tech hubs in asia pacific cushman and wakefield reported

indian cities ranked among top tech hubs with talented work force and it office space
Story first published: Friday, August 26, 2022, 15:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X