For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్‌లో ఈ-స్కూటర్, రూ.2,000 చేతక్‌ను బుక్ చేసుకోండి

|

ఆటో దిగ్గజం బజాజ్ ఆటో లిమిటెడ్ చేతక్ ఈ-స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకు వస్తోంది. ఈ ఈ-స్కూటర్‌ను హైదరాబాద్‌లో విక్రయించేందుకు ఆన్‌లైన్ బుకింగ్స్‌ను ప్రారంభించింది. www.chetak.com వెబ్‌సైట్ ద్వారా రూ.2,000 చెల్లించి చేతక్ ఈ-స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చునని బజాజ్ ఆటో సూచించింది. ఇప్పటి వరకు చేతక్ ఈ-స్కూటర్ బుకింగ్ పుణే, బెంగళూరు, నాగపూర్, మైసూరు, మంగళూరు, ఔరంగాబాద్, చెన్నైలలో మాత్రమే ఉంది. ఇప్పుడు హైదరాబాద్‌లోను విక్రయిస్తోంది. చేతక్ ఈ-స్కూటర్ నాలుగు రంగులు, మూడేళ్లు లేదా 50,000 కిలోమీటర్ల బ్యాటరీ వ్యారంటీతో అందిస్తోంది. 12,000 కిలో మీటర్లు లేదా ఏడాది తర్వాత సర్వీసింగ్ ఉంటుంది. ఈ స్కూటర్ ధర రూ.1.44 లక్షల(రూ.1,44,175) నుండి ప్రారంభమవుతుంది. టెస్ట్ రైడ్ కోసం ఆసక్తి కలిగిన వినియోగదారులు బేగంపేట, కాచిగూడ, కూకట్‌పల్లిలోని చేతక్ ఈ-స్కూటర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్స్‌ను సందర్శించవచ్చు. ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ డెలివరీలు అక్టోబర్ నుండి ప్రారంభిస్తారు. చేతక్ ఈ-స్కూటర్ ఐదు గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుందని, ఒకసారి చార్జింగ్ చేస్తే 90 కిలో మీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.

చేతక్ అంటే మక్కువ

చేతక్ అంటే మక్కువ

కార్లు, బస్సులు వంటి దాదాపు అన్ని రకాల వాహనాలు క్రమంగా ఎలక్ట్రిక్ (EV) దిశగా అడుగులు వేస్తున్నాయి. పర్యావరణహిత EVను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీంతో వివిధ కంపెనీలు EV వాహనాలను తయారు చేస్తున్నాయి. ఇందులో భాగంగా బజాజ్ చేతక్ బ్రాండ్ EVతో పునరాగమనం చేసింది. టూవీలర్స్ ఇష్టపడేవారికి, నాటి బజాజ్ చేతక్ అంటే మక్కువ కలిగిన వారికి ఈ చేతక్ ఈ-స్కూటర్ పునరాగమనం శుభవార్త. గతంలో చేతక్ అంటే ఎంతోమందికి క్రేజ్. సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలతో పాటు నాణ్యతకు పేరుగాంచింది బజాజ్ చేతక్. ఎంతోమందిని ఆకట్టుకున్న చేతక్ బ్రాండ్ ఇప్పుడు ఈ-స్కూటర్‌గా తిరిగి వచ్చింది.

హైదరాబాద్‌లోను ఆదరణ

హైదరాబాద్‌లోను ఆదరణ

ప్లాంటులో బజాజ్ చేతక్ ఈ-స్కూటర్ ఉత్పత్తి సెప్టెంబర్ 25, 2019న ప్రారంభమైంది. 2020లో లాంచ్ చేశారు. చేతక్ ఈ-స్కూటర్ నాలుగు రంగులు (ఇండిగో మెటల్లిక్, వెలుట్టో రోసో, బ్రూక్లిన్ బ్లాక్, హాజెల్‌నట్) ఉంటుంది. దేశంలోని వివిధ నగరాల్లో చేతక్‌కు ఇప్పటికే అపూర్వ ఆదరణ లభిస్తోందని, హైదరాబాద్‌లోను మంచి స్పందన వస్తుందని భావిస్తున్నామని, అక్టోబర్ 2021 నుండి ఫస్ట్ షిప్‌మెంట్ ఉంటుందని బజాజ్ ఆటో ఈడీ రాకేష్ శర్మ అన్నారు.

కొన్ని ఫీచర్స్

కొన్ని ఫీచర్స్

ఈ-స్కూటర్‌కు అన్ని రకాల ఆధునిక రైడింగ్ సదుపాయాలు కల్పించారు. మెటల్ బాడీ, ఎల్ఈడీ లైట్లు, సైడ్ స్టాండ్, ఇండికేటర్ ఫీచర్స్, పిలియన్ ఫూట్‌పెగ్స్ ఉన్నాయి. అలాయ్ వీల్స్‌తో పాటు బ్రేకింగ్ కోసం డిస్క్ బ్రేక్ సిస్టంను అమర్చారు. ఈ స్కూటర్‌కు మూడేళ్లు లేదా 50 వేల కిలో మీటర్ల వారెంటీ ఉంది. బజాజ్ చేతక్ 4kW ఎలక్ట్రిక్ మోటార్, దానికి శక్తిని ఇచ్చి లిథియం అయాన్ బ్యాటరీలను అమర్చారు. స్పోర్ట్స్ మోడల్ 85 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఓలా ఎలక్ట్రిక్ కేవలం రెండు రోజుల్లోనే రూ.1,100 కోట్ల విలువ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్స్‌ను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. మొదటి రోజు కంటే రెండో రోజు ఈవీ స్కూటర్ సేల్స్ ఎక్కువగా ఉన్నాయని, దీంతో రెండు రోజుల్లో సేల్స్ రూ.11000 కోట్లు దాటాయని ఓలా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కో చైర్మన్ భవేష్ అగర్వాల్ ట్వీట్ చేశారు.

English summary

హైదరాబాద్‌లో ఈ-స్కూటర్, రూ.2,000 చేతక్‌ను బుక్ చేసుకోండి | Bajaj Auto opens bookings for e-scooter Chetak in Hyderabad

Bajaj Auto has opened online booking for the Chetak Electric scooter in Hyderabad at www.chetak.com on payment of Rs 2000.
Story first published: Wednesday, September 22, 2021, 8:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X