For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

15 ఏళ్ల తర్వాత హమారా బజాజ్.. మార్కెట్‌లోకి ఎలక్ట్రీక్ స్కూటర్.. ధర ఎంతో తెలుసా?

|

ఒకప్పుడు వాహన ప్రియులు ఎంతో ముచ్చటపడిన హమారా బజాజ్ మళ్లీ 15 ఏళ్ల తర్వాత మార్కెట్‌లోకి వచ్చింది. ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో మంగళవారం చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. దీని ధర 1 లక్ష( ఎక్స్ షో రూమ్)గా నిర్ణయించింది. తొలుత చేతక్ స్కూటర్‌ను పూణే, బెంగళూరులో అమ్మకాలను చేపట్టనున్నది. ఆ తర్వాత భారత్‌లో పలు నగరాలతోపాటు యూరోపియన్ మార్కెట్‌లోకి కూడా ఎగుమతి చేయాలని నిర్ణయించింది.

ఆరు రంగుల్లో ఎలక్రికల్ స్కూటర్

ఆరు రంగుల్లో ఎలక్రికల్ స్కూటర్

ద్విచక్ర వాహనం చేతక్ ఎలక్ట్రికల్ స్కూటర్‌ను అక్టోబర్ 2019లో ఆవిష్కరించింది. దాదాపు ఆరు రంగుల్లో దీనిని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. బజాజ్ చేతక్ అర్బేన్ రూ.1 లక్షగా, బజాజ్ చేతక్ ప్రీమియం రూ.1.15 లక్షల ధరగా నిర్ణయించింది.

ఎలక్ట్రికల్ స్కూటర్ ప్రత్యేకతలు

ఎలక్ట్రికల్ స్కూటర్ ప్రత్యేకతలు

బజాజ్ స్కూటర్ ప్రత్యేకతలు ఏమిటంటే.. 4kW మోటార్‌తో పీక్ టార్క్ 16ఎన్ఎమ్‌గా రూపొందించారు. ఎలక్రికల్ అవుట్‌లెట్ 15ampతో చార్జీ అయ్యే విధంగా IP67 రేటెడ్ 3kWh (48V, 60.3 AH) లితియం ఐయాన్ బ్యాటరీ. ఏకధాటిగా వాడితే సుమారు ఐదు గంటల్లో పూర్తిగా చార్జి అవుతుంది. గంట సేపు చార్జింగ్ చేస్తే 25 శాత మేరకు బ్యాటరీ చార్జ్ అవుతుంది. చేతక్ కొనుగోలు చేస్తే ఛార్జర్‌ను కాంప్లిమెంటరీగా ఇస్తున్నారు. దీని జీవితకాలం 70 వేల కిలో మీటర్లు అని కంపెనీ పేర్కొన్నది.

 రెండు మోడ్స్‌లో

రెండు మోడ్స్‌లో

బజాజ్ చేతక్ ఎలక్ట్రికల్ స్కూటర్ రెండు మోడ్స్‌లో లభ్యమవుతుంది. ఒకటి 95 కిలోమీటర్లతో ఏకో మోడ్. 85 కిలో మీటర్లతో స్పోర్ట్స్ మోడ్. ఈ వాహనం వారంటీ మూడు సంవత్సరాలు లేదా 50 వేల కిలోమీటర్లు. ఏడాది తర్వాత లేదా 12 వేల కిలోమీటర్లు తిరిగిన అనంతరం సర్వీసింగ్‌కు అవకాశం కల్పించారు.

స్కూటర్ ప్రత్యేకతలు

స్కూటర్ ప్రత్యేకతలు

షీట్ మెటల్ బాడీతో బజాజ్ చేతక్ స్కూటర్‌ను రూపొందించారు. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, హార్స్‌షూ షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్‌ఈడీ ఇండికేటర్స్, కీలెస్ ఇగ్నిషన్, రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, 12 ఇంచుల ఆలీ వీల్స్, డిస్క్ బ్రేక్ తదితర ప్రత్యేకతలు ఈ వాహనం సొంతం.

జనవరి 15 నుంచి రిజిస్ట్రేషన్లు

జనవరి 15 నుంచి రిజిస్ట్రేషన్లు

బజాజ్ చేతక్‌ను తొలుత పూణే, బెంగళూరులో అమ్మకాలు ప్రారంభిస్తారు. జనవరి 15 నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. కేటీఎం డీలర్ల వద్ద రూ.2000 వేలు చెల్లించి ఈ వాహనాన్ని బుకింగ్ చేసుకోవాలి అని బజాజ్ చేతక్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

English summary

15 ఏళ్ల తర్వాత హమారా బజాజ్.. మార్కెట్‌లోకి ఎలక్ట్రీక్ స్కూటర్.. ధర ఎంతో తెలుసా? | Bajaj Auto introduced Bajaj Chetak Electrical Scooter

Bajaj Auto introduced Bajaj Chetak Electrical Scooter into market after 15 years. This vehicle price is Rs 1 lakh (ex-showroom).
Story first published: Tuesday, January 14, 2020, 19:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X