భారతదేశంలో ఏవియేషన్ రంగం కుదేలవుతోంది. కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ కుదేలవుతోంది. కరోనా మహమ్మారి భారతదేశాన్ని వదలకుండా వేధిస్తున్న కారణంగా అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని కేంద్రం ఆగస్టు 31 వరకు పొడిగించింది. దీంతో పలు విమానయాన సంస్థలు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నాయి. కరోనా నేపథ్యంలో చోటుచేసుకున్న పరిస్థితుల దృష్ట్యా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జులై 31 తో ముగియవలసిన అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిషేధాన్ని, ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించింది.
ఇక వందే భారత్ మిషన్ కింద నడుస్తున్న విమానాలు ఎప్పట్లానే కార్యకలాపాలనుసాగించనున్నాయి. ఆయా దేశాలలో జరిగిన ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందాల ప్రకారం నడుస్తున్న విమానాలు కూడా యధావిధిగా కొనసాగనున్నాయి. పలు కార్గో విమాన సేవలు కూడా నిరంతరాయంగా కొనసాగనున్నాయి. అయినప్పటికీ ఇండియన్ ఏవియేషన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. భారతదేశంలోని విమానయాన సంస్థలు 2022 ఆర్థిక సంవత్సరంలో 4.1 బిలియన్ డాలర్ల ఏకీకృత నష్టాన్ని నమోదు చేసే అవకాశం ఉందని ఏవియేషన్ కన్సల్టెన్సీ సిఏపీఏ అంచనా వేసింది.

ఈ మొత్తం 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నష్టాలను పోలి ఉంటుంది, ఇది మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాల మొత్తం నష్టాలను 8 బిలియన్ డాలర్లకు తీసుకు వెళ్ళింది. ఆర్థిక సంవత్సరం 2022 లో విమానయాన సంస్థలకు దాదాపు 5 బిలియన్ డాలర్ల రీక్యాపిటలైజేషన్ అవసరం కావచ్చు, అందులో 1.1 బిలియన్ డాలర్లు ఐ పి వో లు లు, క్యూఐపిలు లు మరియు ఇతర పరికరాల రూపంలో అవసరం ఉన్నాయని సిఏపిఏ తెలిపింది. కోవిడ్-19 కేసుల పెరుగుదల తరువాత ఏప్రిల్ మరియు మేలో ట్రావెల్ బ్యాన్ విధించిన తరువాత , జూన్ ,జూలైలో కోలుకుంటుందని భావిస్తే ఇప్పటికీ అంతర్జాతీయ విమాన సర్వీసులు లేక ఇండియన్ ఏవియేషన్ తీవ్ర నష్టాలను చవిచూస్తోంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications