For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

D-Mart: డీ-మార్ట్ ఆదాయం రూ. 680 కోట్లు.. కొత్తగా 110 స్టోర్లు ప్రారంభం..

|

డీ-మార్ట్ మాతృ సంస్థ అవెన్యూ సూపర్ మార్ట్స్ జూన్ 2022తో ముగిసిన త్రైమాసికం ఫలితాలు విడుదల చేసింది. లాభాల్లో 490 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. జూన్ త్రైమాసికంలో స్టాండ్ అలోన్ లాభం రూ.680 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.115 కోట్లుగా ఉంది. జూన్ 2022తో ముగిసిన త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సంవత్సరానికి 95 శాతం పెరిగి రూ. 9,807 కోట్లకు చేరుకుంది.

కొత్తగా 110 స్టోర్లు
అవెన్యూ సూపర్‌మార్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 మొదటి త్రైమాసికంలో 10 స్టోర్‌లను కొత్తగా ప్రారంభించింది. "మేము గత 3 ఆర్థిక సంవత్సరాల్లో 110 స్టోర్‌లను ప్రారంభించాము.ఈ త్రైమాసికంలో ఈ స్టోర్‌లు చాలా బాగా పనిచేశాయి" అని CEO & మేనేజింగ్ డైరెక్టర్ నెవిల్లే నోరోన్హా చెప్పారు. గత సంవత్సరం, Q1FY23లో మార్జిన్ 10.3 శాతానికి గణనీయంగా విస్తరించిందన్నారు.

 Avenue Supermarts Q1 profit jumps 6-fold to Rs 680 crore as revenue spikes 95%

పెరిగిన ఎబిటా మార్జిన్
కంపెనీ EBITDA గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 221 కోట్ల నుండి Q1FY23లో దాదాపు నాలుగు రెట్లు పెరిగి రూ.1008 కోట్లకు చేరుకుంది. అదేవిధంగా, DMart EBITDA మార్జిన్ సంవత్సరానికి 4.4 శాతం నుంచి 10.3 శాతం పెరిగింది.

Read more about: d mart avenue supermarts
English summary

D-Mart: డీ-మార్ట్ ఆదాయం రూ. 680 కోట్లు.. కొత్తగా 110 స్టోర్లు ప్రారంభం.. | Avenue Supermarts Q1 profit jumps 6-fold to Rs 680 crore as revenue spikes 95%

Hypermarkets chain D-Mart operator Avenue Supermarts on July 9 reported a massive 490 percent year-on-year growth in standalone profit for the quarter ended June 2022, backed by healthy topline and operating performance.
Story first published: Saturday, July 9, 2022, 16:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X