కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఆటోమొబైల్ రంగం దారుణంగా కుదేలైంది. ఇక అన్ లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత ఆటోమొబైల్ రంగం కొద్దికొద్దిగా పుంజుకుంటుంది. ఇప్పటికే ఆటోమొబైల్ రంగంలో ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్ల కొనుగోలు ఊపందుకుంది . సెప్టెంబర్ మాసంలో చూసినట్లయితే ఆటోమొబైల్ రంగం బాగానే పుంజుకున్నట్లుగా కనిపిస్తుంది . ఈ నెలంతా దసరా, దీపావళి పండుగ సీజన్ కావడంతో కొనుగోళ్లపై ఆటోమొబైల్స్ సంస్థలు బాగానే అంచనాలు పెట్టుకున్నాయి.

సెప్టెంబర్ నెలలో పుంజుకున్న ఆటోమొబైల్స్ ... కొనుగోళ్ళపై హర్షం
కరోనా వైరస్ కారణంగా దెబ్బ తిన్న ఆటోమొబైల్ పరిశ్రమ తిరిగి నిదానంగా కోలుకుంటోంది. సెప్టెంబర్ నెలలో చూసినట్లయితే బజాజ్ ఆటో వాహన విక్రయాలు అంచనాలను మించి కొనుగోలు చేశారు. దీంతో ఎన్ఎస్ఈ లో బజాజ్ ఆటో షేర్ 5.3 శాతం పెరిగి 3033 రూపాయల వద్ద ట్రేడవుతోంది. మరోపక్క టీవీఎస్ మోటార్ సైకిల్ మెరుగైన అమ్మకాలను సాధించింది. హీరో, హోండా ద్విచక్ర వాహనాల అమ్మకాలలో ఇప్పుడిప్పుడే మెరుగుదలను చూపిస్తున్నాయి. సెప్టెంబర్ నెల మొత్తంగా చూసుకుంటే ఆటో మొబైల్స్ రంగం కొద్దిగా మెరుగుపడినట్లుగా తెలుస్తోంది.

వివిధ ఆటోమొబైల్స్ సంస్థల వాహన విక్రయాలు ఇలా
బజాజ్ ఆటో కి సంబంధించి విక్రయాలను చూసినట్లయితే ఒక సెప్టెంబర్ నెలలోనే 4.4 ఒక లక్షల వాహనాలను బజాజ్ ఆటో విక్రయించింది. కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ మొత్తం అమ్మకాలు గత నెలలో 31 శాతం జంప్‌చేసి 1.6 లక్షల యూనిట్లను అధిగమించగా, ఎస్కార్ట్స్ లిమిటెడ్ ట్రాక్టర్ల విక్రయాలు 9 శాతం బలపడి 11,851 యూనిట్లను తాకాయి. ఇదే ఇధంగా ఎంఅండ్‌ఎం సైతం 17 శాతం అధికంగా 43,386 ట్రాక్టర్ల అమ్మకాలను నమోదు చేసుకుంది.

పండుగ సీజన్ కావటంతో అక్టోబర్ పై భారీ అంచనా
ఇప్పుడు పండగ సీజన్ కావడంతో ఆటోమొబైల్ సంస్థల అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు కొత్త మోడల్స్ ను రిలీజ్ చేసి కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. సెప్టెంబర్ నెలతో పోల్చిచూస్తే అక్టోబర్ లో భారీగా అమ్మకాలను సాగించాలని ఆటోమొబైల్స్ సంస్థలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. డిస్కౌంట్స్ , ఆఫర్స్ ప్రకటిస్తూ కస్టమర్లను పండుగ సీజన్ లో కొనుగోళ్లకు ఆకర్షిస్తున్నాయి . ఆన్ లైన్ లో సైతం బుకింగ్స్ చేస్తూ అమ్మకాలలో పురోగతి సాధించే సన్నాహాల్లో ఉన్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications