For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాహన విక్రయాలు డీలా, ఏప్రిల్‌తో పోలిస్తే మేలో భారీగా పడిపోయిన సేల్స్

|

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్, కర్ఫ్యూలు, ఉత్పత్తి నిలిపివేత వంటి అంశాల ప్రభావం ఈ ఏడాది మే నెలలో వాహన విక్రయాలపై తీవ్రంగా పడింది. ఏప్రిల్ నెలతో పోలిస్తే ఆటో విక్రయాలు క్షీణించాయి. సాధారణంగా ఏడాది క్రితం ఇదే నెలలో నమోదైన విక్రయాలతో పోల్చి చూస్తారు. అయితే గత ఏడాది మే నెలలో పూర్తి లాక్ డౌన్ కొనసాగింది. దీంతో సేల్స్ లేవు. వాహన విక్రయాలు నమోదు కాలేదు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నెలతో పోల్చి గణాంకాలు వెల్లడిస్తున్నారు.

మారుతీ సుజుకీ విక్రయాలు

మారుతీ సుజుకీ విక్రయాలు

దేశీయ అతిపెద్ద కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా మే నెలలో 32,903 పాసింజర్ వాహనాలను విక్రయించింది. ఏప్రిల్ నెలలో 1.35 లక్షల వాహనాలు విక్రయించింది. అదే 2020 మే నెలలో 13,702 వాహనాలను విక్రయించింది. మారుతీ సుజుకీ మే 1వ తేదీ నుండి మే 16వ తేదీ వరకు ఉత్పత్తిని నిలిపివేసింది. తన ఆక్సిజన్‌ను పారిశ్రామిక ఉత్పత్తికి బదులు మెడికల్ అవసరాల కోసం మళ్లించేందుకు ఉత్పత్తిని నిలిపివేసింది. పూర్తిస్తాయి లాక్ డౌన్ అమలైన మే 2020 సేల్స్‌తో మే 2021 సేల్స్ పోల్చలేం.

హ్యుండాయ్, టాటా మోటార్ సేల్స్

హ్యుండాయ్, టాటా మోటార్ సేల్స్

హ్యుండాయ్ మోటార్ విక్రయాలు మే నెలలో 25,001 నమోదయ్యాయి. లాక్ డౌన్ కారణంగా గత ఏడాది మే నెలలో 6,883 సేల్స్ ఉన్నాయి. 2021 ఏప్రిల్ నెలలో 49,002 విక్రయాలు నమోదయ్యాయి.

టాటా మోటార్స్ డొమెస్టిక్ పాసింజర్ వెహికిల్ సేల్స్ ఏప్రిల్ 2021లో 25,095 కాగా, మే నెలలో 15,181కి పడిపోయాయి. 2020 మే నెలలో 3,152కు పరిమితం అయ్యాయి. మే నెలలో డొమెస్టిక్ కమర్షియల్ వెహికిల్ సేల్స్ 9371 యూనిట్లుగా ఉన్నాయి. ఏప్రిల్ నెలలో ఈ సేల్స్ 14,435. మే 2020న 1266 సేల్ అయ్యాయి.

మహీంద్రా అండ్ మహీంద్రా

మహీంద్రా అండ్ మహీంద్రా

మహీంద్రా అండ్ మహంద్రా డొమెస్టిక్ పాసింజర్ వెహికిల్ సేల్స్ 2021 ఏప్రిల్ నెలలో 18,285 కాగా, మే నెలలో 8,004కు పడిపోయాయి. అదే మే 2020లో 3,867 యూనిట్లుగా నమోదయ్యాయి. మే నెలలో డొమెస్టిక్ కమర్షియల్ వెహికిల్ సేల్స్ 7,508.ఏప్రిల్ నెలలో 16,147 నమోదయ్యాయి. అదే మే 2020 నెలలో 5209గా ఉన్నాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్ 2021 ఏప్రిల్ నెలలో 9,622 కాగా, మే నెలలో 707కు పడిపోయాయి.

English summary

వాహన విక్రయాలు డీలా, ఏప్రిల్‌తో పోలిస్తే మేలో భారీగా పడిపోయిన సేల్స్ | Auto sales May 2021: Vehicle sales decline from April levels

Amid multiple State-wise lockdowns and disruptions to production, automakers posted muted wholesales of vehicles last month.
Story first published: Wednesday, June 2, 2021, 10:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X