For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండుగ జోష్: మారుతీ సహా వాహనాల సేల్స్ భారీగా జంప్, ఆటోకు 'డబుల్' బొనాంజా

|

ఆటో సేల్స్ అక్టోబర్ నెలలో భారీగా పుంజుకున్నాయి. దసరా, దీపావళి పండుగ సీజన్ నేపథ్యంలో అక్టోబర్‌లో వాహనాల సేల్స్ రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. హీరో మోటోకార్ప్‌కు ఫెస్టివెల్ సీజన్ కలిసి వచ్చింది. టాటా మోటార్స్ సేల్స్ నెలల గరిష్టాన్ని తాకడం గమనార్హం. మారుతీ చరిత్రలో ఓ నెలలో ఎక్కువ సేల్స్ అక్టోబర్ నెలలో నమోదయ్యాయి. ప్రతి నిమిషానికి 4 కార్లు విక్రయించింది ఈ సంస్థ. కరోనా నేపథ్యంలో ఓ సమయంలో సున్నాకు పడిపోయిన డొమెస్టిక్ వెహికిల్ సేల్స్ ఇప్పుడు ఏకంగా రికార్డులు సృష్టించడం ఆటో కంపెనీలకు భారీ ఊరట కలిగించింది.

నిర్మలతో పనిచేయడం కష్టం, జైట్లీ మాస్టర్ మైండ్: మాజీ ఆర్థిక కార్యదర్శి సంచలనంనిర్మలతో పనిచేయడం కష్టం, జైట్లీ మాస్టర్ మైండ్: మాజీ ఆర్థిక కార్యదర్శి సంచలనం

హోండా మోటోకార్ప్ అదుర్స్

హోండా మోటోకార్ప్ అదుర్స్

మారుతీ, హ్యుండాయ్ మోటార్ఇండియా సేల్స్ డబుల్ డిజిట్ వృద్ధిని నమోదు చేశాయి. హోండా కార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్, మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు పుంజుకున్నాయి.

హీరో మోటోకార్ప్ సేల్స్ 35 శాతం ఎగిసి 8.06 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. మోటార్ సైకిల్ సేల్స్ 32.5 శాతం పెరిగాయి. గత ఏడాది 7.32 లక్షల యూనిట్లు ఉన్నాయి. స్కూటర్ సేల్స్ గత ఏడాది 46,576 కాగా, ఈసారి 74,350 యూనిట్లకు పెరిగాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్స్ 7 శాతం ఎగిశాయి. డొమెస్టిక్ సేల్స్ గత ఏడాది 62,858 యూనిట్లు కాగా, ఈసారి 66,891 నమోదయ్యాయి. ఎగుమతులు మాత్రం 9 శాతం క్షీణించి 4,033 యూనిట్లుగా ఉన్నాయి.

మారుతీ సుజుకీ సేల్స్ 19 శాతం అప్

మారుతీ సుజుకీ సేల్స్ 19 శాతం అప్

మారుతీ సుజుకీ అక్టోబర్ సేల్స్ అంతకుముందు ఏడాది ఇదే నెలతో పోలిస్తే 19 శాతం ఎగిసి 1.82 లక్షల యూనిట్లుగా ఉంది. డొమెస్టిక్ సేల్స్ 17.9 శాతం ఎగిసి 1.24 లక్షల యూనిట్లు కాగా, ఎగుమతులు 4.7శాతం ఎగిసి 9,586 యూనిట్లుగా ఉన్నాయి. వాగనార్, స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ సేల్స్ 26.6 శాతం ఎగిసి 95,067 యూనిట్లుగా ఉంది. ఎర్టిగా, బ్రెజ్జా సేల్స్ 9.9 శాతం పెరిగి 25,396 యూనిట్లుగా ఉంది. లైట్ కమర్షియల్ వెహికిల్ సేల్స్ 30.5 శాతం పెరిగి 32.9 శాతంగా నమోదయ్యాయి. ప్రతి నిమిషానుకు నాలుగు కార్లు సేల్ అయ్యాయి.

టాటా మోటార్స్ జంప్

టాటా మోటార్స్ జంప్

టాటా మోటార్స్ సేల్స్ భారీగా పుంజుకున్నాయి. కేవలం నవరాత్రి సమయంలో ఏడాది ప్రాతిపదికన ఏకంగా 90 శాతం ఎగిసి గత ఏడాది 5,725 యూనిట్ల నుండి10,887 యూనిట్లకు పెరిగింది. కంపెనీ 6,641 యుటిలిటీ వెహికిల్స్, 4,246 కార్లను విక్రయించింది. గత ఏడాది ఇది వరుసగా 3,321, 2,404 యూనిట్లుగా ఉన్నాయి. ఇదే నవరాత్రి సీజన్‌లో కియా మోటార్ సేల్స్ 224 శాతం ఎగిసింది.

టయోటాకు పండుగ సీజన్ కలిసి వచ్చింది. మొత్తం 12వేలకు పైగా వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే సమయంలో 11,866 విక్రయించింది. 744 కార్లను ఎగుమతి చేసింది.

English summary

పండుగ జోష్: మారుతీ సహా వాహనాల సేల్స్ భారీగా జంప్, ఆటోకు 'డబుల్' బొనాంజా | Auto sales in October 2020: Hero MotoCorp, Tata Motors, Maruti record sales

Tata Motors has managed to retain 3rd spot on the sales table, having yet again pipped Kia Motors India to the spot. Of course Tata Motors has been around longer, and sells a wider range of cars. The manufacturer is now hobnobbing triumphantly on podium having darted ahead of Mahindra sales in recent months.
Story first published: Monday, November 2, 2020, 7:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X