For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Auto Sales: టాటా మోటార్స్, ఐచర్ సేల్స్ పెరిగాయి, వోల్వో సేల్స్ డౌన్

|

డిసెంబర్ 2020లో ఆటో సేల్స్ ఆశాజనకంగా ఉన్నాయి. ఏడాది ప్రాతిపదికన, నెల ప్రాతిపదికన భారీగా పెరిగాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా సేల్స్ పెరిగిన విషయం తెలిసిందే. టాటా మోటార్స్, యమహా, ఐచర్ మోటార్ సేల్స్ కూడా జంప్ చేశాయి. మారుతీ సుజుకీ ఇండియా(MSI) విక్రయాలు గత ఏడాది చివరి నెలలో ఏడాది ప్రాతిపదికన 20 శాతం పెరిగాయి. ఐచర్ సేల్స్ 37 శాతం, టాటా మోటార్స్ సేల్స్ 21 శాతం, హ్యుండాయ్ 25 శాతం, అశోక్ లేలాండ్ 14 శాతం పెరిగాయి. వోల్వో సేల్స్ మాత్రం 3 శాతం తగ్గాయి.

మారుతీ సుజుకీ, మహీంద్రా అదరగొట్టాయి... స్టాక్స్ జంప్: డిసెంబర్ సేల్స్ ఎలా ఉన్నాయంటేమారుతీ సుజుకీ, మహీంద్రా అదరగొట్టాయి... స్టాక్స్ జంప్: డిసెంబర్ సేల్స్ ఎలా ఉన్నాయంటే

టాటా మోటార్స్ సేల్

టాటా మోటార్స్ సేల్

ఏడాది ప్రాతిపదికన టాటా మోటార్స్ సేల్స్ 21 శాతం ఎగిసి, 53,430 యూనిట్లుగా నమోదయ్యాయి. కమర్షియల్ వెహికిల్ సేల్స్ మాత్రం 5 శాతం క్షీణించి 29,885 యూనిట్లకు పరిమితమయ్యాయి. పాసింజర్ క్యారియర్, స్మాల్ కమర్షియల్ వెహికిల్ సేల్స్ పడిపోవడంతో ప్రభావం పడింది. కారు సేల్స్ 84 శాతం పెరిగి 23,545గా నమోదయ్యాయి.

ఐచర్ మోటార్ సేల్స్ డిసెంబర్ నెలలో 37 శాతం పెరిగాయి. 2019 డిసెంబర్ నెలలో మొత్తం సేల్స్ 50,416 కాగా, 2020 డిసెంబర్‌లో 68,995 నమోదయ్యాయి. ఎగుమతులు 82 శాతం పెరిగి 3,503 నమోదయ్యాయి. 350 సీసీ ఇంజిన్ కెపాసిటీ వరకు సేల్స్ 33 శాతం పెరగగా, 350 సీసీ కంటే పైన సేల్స్ రెండింతలు పెరిగాయి.

హ్యుండాయ్, అశోక్ లేలాండ్

హ్యుండాయ్, అశోక్ లేలాండ్

హ్యుండాయ్ సేల్స్ ఏడాది ప్రాతిపదికన డిసెంబర్ నెలలో 24.89 శాతం పెరిగి 47,400 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎగుమతులు 58.84 శాతం పెరిగి 19,350 యూనిట్లుగా ఉన్నాయి. 2020 డిసెంబర్‌లో 71,178 కార్లను ఉత్పత్తి చేసింది. ఏదేని ఓ నెలలో ఇదే రికార్డ్. 2020లో మొత్తం డొమెస్టిక్ సేల్స్ 4,23,642కు పెరిగాయి.

అశోక్ లేలాండ్ సేల్స్ 14 శాతం పెరిగాయి 2020 డిసెంబర్ నెలలో సేల్స్ 12,762 నమోదయ్యాయి. మీడియం, హెవీ కమర్షియల్ వెహికిల్ సేల్స్ మాత్రం 2 శాతం క్షీణించి 7025 నుండి 6884కు పడిపోయాయి. ఎగుమతులు 14.5 శాతం పెరిగి 790 నుండి 905 యూనిట్లుగా ఉన్నాయి.

వోల్వో డౌన్

వోల్వో డౌన్

వోల్వో ఐచర్ కమర్షియల్ వెహికిల్ సేల్స్ ఏడాది ప్రాతిపదికన 3 శాతం క్షీణించి 5042 (2019 డిసెంబర్) నుండి 4892(2020 డిసెంబర్)కు తగ్గాయి. డొమెస్టిక్ సేల్స్ 7.7 శాతం క్షీణించి 4410 నుండి 4069కి తగ్గగా, ఎగుమతులు 23.6 శాతం పెరిగి 500 నుండి 618కి పెరిగాయి.

యమహా సేల్స్ డిసెంబర్ 2020లో 33 శాతం పెరిగి 39,224 యూనిట్లుగా నమోదయ్యాయి. 2019 డిసెంబర్‌లో ఈ సంఖ్య 29,486 యూనిట్లుగా ఉంది.

English summary

Auto Sales: టాటా మోటార్స్, ఐచర్ సేల్స్ పెరిగాయి, వోల్వో సేల్స్ డౌన్ | Auto Sales In December 2020: Tata Motors PV sales nearly double

Tata Motors Ltd. reported a 21% increase in domestic sales as higher car deliveries offset the impact of lower commercial vehicle demand.
Story first published: Friday, January 1, 2021, 20:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X