For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇది భరించలేం!: మార్జిన్ పెంచండి, అప్పుడే వ్యాపారాలు చేయగలం

|

తమ వ్యాపారం లాభాల్లోకి రావాలంటే మార్జిన్ కనీసం 7 శాతంగా ఉండాలని ఆటోమోబైల్ డీలర్స్ కోరుతున్నారు. వివిధ కారణాల వల్ల వాహనాల సేల్స్ తగ్గిపోయాయని, దీంతో పాటు కార్యకలాపాల ఖర్చులు పెరిగిపోయాయని, దీంతో లాభాలు కనిపించడం లేదని చెబుతున్నారు. అంతకుముందు మందగమనం కారణంగా, ఇప్పుడు కరోనా - లాక్ డౌన్ వల్ల ఆపరేటింగ్ కాస్ట్ పెరిగి, వాహనాల సేల్స్ తగ్గాయని గుర్తు చేస్తున్నారు.

వాహన, ఆరోగ్య బీమా చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరటవాహన, ఆరోగ్య బీమా చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట

మార్జిన్ 7 శాతం ఇవ్వాలి

మార్జిన్ 7 శాతం ఇవ్వాలి

ఒక్కో వాహనం విక్రయించేందుకు డీలర్లు సదరు వాహన సంస్థ నుంచి మార్జిన్ లేదా లాభం తీసుకుంటారు. కానీ గత రెండేళ్లుగా వాహనాల సేల్స్ తగ్గుతూ వస్తున్నాయి. దీంతో డీలర్లు ఆర్థికంగా నష్టపోతున్నారు. కాబట్టి తమకు ఒక్కో వాహనంపై 7 శాతం మార్జిన్ ఇవ్వాలని కోరుతున్నారు. వ్యాపారాలు మనుగడ సాగించాలంటే డీలర్ల వ్యయాలు కనీసం 20 శాతం తగ్గేలా చూడాలని వాహన కంపెనీలు డీలర్ల అసోసియేషన్ల సమాఖ్య (FADA) కోరింది.

ఖర్చుకు అనుగుణంగా మార్జిన్ లేదు

ఖర్చుకు అనుగుణంగా మార్జిన్ లేదు

అధిక ఖర్చుల కారణంగా లాభదాయకత క్షీణిస్తోందని, తక్కువ నిర్వహణ మార్జిన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు డీలర్ల సమాఖ్య తెలిపింది. అలాంటి వారికి సత్వరమే సాయం అందించాలని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (SIAM)కు డీలర్ల సమాఖ్య ప్రెసిడెంట్ ఆశిష్ హర్షరాజ్ లేఖ రాశారు. ఉద్యోగుల ఖర్చులు, రుణాలపై చెల్లించే వడ్డీలు, అద్దెలు పెరుగుతున్నాయని, దీనికి తోడు వాహనాల విక్రయాల సంఖ్య తగ్గుతోందని కానీ డీలర్ మార్జిన్ మాత్రం పెరుగుతున్న వ్యయాలకు అనుగుణంగా లేవని పేర్కొన్నారు.

3.5 శాతం మార్జిన్ ఉన్నా..

3.5 శాతం మార్జిన్ ఉన్నా..

వాహన డీలర్లు కేవలం 3.5 శాతం మార్జిన్లకే విక్రయిస్తున్నారని, తద్వారా మొత్తం టర్నోవర్‌లో ఇది 0.5 శాతం నుండి 1 శాతం నికర లాభానికే వారు వ్యాపారాలను నిర్వహించాల్సి వస్తోందని పేర్కొన్నారు. మందగమనం కారణంగా గత పదిహేను నెలలుగా ఆ కనీస మార్జిన్‌లోను ఇబ్బందులు ఉన్నాయని, చాలామంది డీలర్ల వ్యాపారాలు నష్టాల్లో ఉన్నాయని తెలిపారు.

English summary

ఇది భరించలేం!: మార్జిన్ పెంచండి, అప్పుడే వ్యాపారాలు చేయగలం | Auto dealers seek higher sales margin as profit drops

Automobile dealers have sought a rise in sales margin per vehicle to at least 7 per cent in order to make their businesses sustainable amid high operating costs and a drop in volumes due to a prolonged slowdown earlier and the coronavirus pandemic now.
Story first published: Monday, June 1, 2020, 13:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X