For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శాండోజ్‌తో 900 మిలియన్ డాలర్ల డీల్ రద్దు చేసుకున్న అరబిందో ఫార్మా

|

అమెరికాలోని శాండోజ్ ఇంక్‌కు చెందిన జనరిస్ ఓరల్ సాలిడ్స్, డెర్మిటాలజీ వ్యాపారాల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదన డీల్‌ను రద్దు చేసుకున్నట్లు అరబిందో ఫార్మా గురువారం తెలిపింది. ఈ డీల్ వ్యాల్యూ 90 కోట్ల డాలర్లు. రెండు కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందానికి అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ నుండి ఆశించిన సమయంలో ఆమోదం రాలేదని, ఈ నేపథ్యంలో ఒప్పందం రద్దు నిర్ణయం తీసుకున్నట్లు అరబిందో ఫార్మా తెలిపింది.

జనరిక్ ఫార్మాస్యూటికల్స్, బయోసిమిలర్స్‌లో ప్రముఖ కంపెనీగా ఉంది. ఇది స్విట్జర్లాండ్‌కు చెందిన నోవార్టిస్ అనుబంధ కంపెనీ. అరబిందో ఫార్మా హైదరాబాదుకు చెందిన కంపెనీ. అమెరికాలో శాండోజ్ ఇంక్‌కు చెందిన బిజినెస్ కార్యకలాపాలు, మూడు మానుఫ్యాక్చరింగ్ యూనిట్లను కొనుగోలు చేసేందుకు 2018 సెప్టెంబర్ నెలలో అరబిందో ఫార్మా అమెరికా అనుబంధ సంస్థ అరబిందో ఫార్మా యూఎస్ఏ ఇంక్ ఒప్పందం కుదుర్చుకుంది.

Aurobindo Pharma, Sandoz Inc call off $900 million deal

అమెరికాలో తన సొంత సబ్సిడరీ అరబిందో ఫార్మా యూఎస్ఏ ఇంక్ ద్వారా శాండోజ్‌ను సొంతం చేసుకోవాలని భావించింది. ఈ 900 మిలియన్ డాలర్ల డీల్ సఫలమై ఉంటే అమెరికాలో ప్రిస్క్రిప్షన్ ఔషధాల పరంగా రెండో అతిపెద్ద జనరిక్ ఔషధ కంపెనీగా అరబిందో అవతరించి ఉండేది. అంతేకాదు 300 ఉత్పత్తులు ఈ డీల్‌తో అరబిందో చేతికి వచ్చేవి. ఈ డీల్ 2019లో ముగియాల్సి ఉంది. కానీ యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ అనుమతుల జాప్యం కారణంగా రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

English summary

శాండోజ్‌తో 900 మిలియన్ డాలర్ల డీల్ రద్దు చేసుకున్న అరబిందో ఫార్మా | Aurobindo Pharma, Sandoz Inc call off $900 million deal

Aurobindo Pharma on Thursday said the USD 900 million deal to acquire Sandoz Inc's US-based generic oral solids and dermatology businesses has been mutually called off.
Story first published: Friday, April 3, 2020, 11:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X