For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్కో ఉద్యోగి సగటు వేతనం రూ.26.15 లక్షలు, 1,383 మంది విద్యార్థులకు ఆఫర్

|

హైదరాబాద్: క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్-హైదరాబాద్ (ISB) విద్యార్థులు భళా అనిపించారు. వారికి ఆసక్తికర, భారీ వేతనాలు లభించాయి. పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీపీ) 2020 బ్యాచ్‌లోని దాదాపు 890 మంది విద్యార్థులకు ప్లేస్‌మెంట్ ప్రక్రియ దాదాపు పూర్తి కావొస్తుంది. ఇప్పటి వరకు 231 కంపెనీలు ప్లేస్‌మెంట్ కోసం వచ్చాయి. ఇందులో 1,383 మంది విద్యార్థులకు ఉద్యోగ ఆఫర్లు వచ్చాయి.

ప్రయాణీకులకు ఆర్టీసీ షాక్, ఛార్జీల పెంపు: కి.మీ.కు ఎంత?ప్రయాణీకులకు ఆర్టీసీ షాక్, ఛార్జీల పెంపు: కి.మీ.కు ఎంత?

సగటు వార్షిక వేతనం రూ.26.15 లక్షలు

సగటు వార్షిక వేతనం రూ.26.15 లక్షలు

ఈ ఆఫర్ ప్రకారం పీజీపీ విద్యార్థులకు లభించే సగటు వార్షిక వేతనం రూ.26.15 లక్షలుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే వార్షిక సగటు, ఉద్యోగ ఆఫర్లు ఈసారి చాలా ఆకర్షణీయంగా ఉన్నట్లు ISB తెలిపింది. క్రితం ఏడాదితో పోలిస్తే వేతన సగటు 124 శాతం ఎక్కువ. దేశీయ, అంతర్జాతీయ కార్పోరేట్ సంస్థలు ఇక్కడి విద్యార్థులను తీసుకుంటున్నాయి. ఈ ఏడాది 1,383 మందికి ఆఫర్లు రాగా, క్రితం సంవత్సరం 1,194 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. విద్యార్థుల భవిష్యత్తు నాయకుడిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ISB పనిచేస్తోందని, ఇప్పటికే ఎంతో మంది నైపుణ్యం కలిగిన విద్యార్థులను చేజిక్కించుకోవడానికి దేశీయ కంపెనీలు ISBనే ఎంచుకున్నట్లు డీన్ ప్రొఫెసర్ రాజేందర్ తెలిపారు.

ఏయే రంగాలు వచ్చాయి?

ఏయే రంగాలు వచ్చాయి?

కన్సల్టింగ్, ఐటీ/ఐటీఈఎస్/ టెక్నాలజీ, ఈ-కామర్స్, బీఎఫ్ఎస్ఐ, ఎఫ్ఎంసీజీ/రిటైల్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలకు చెందిన సంస్థలు ఉద్యోగ అవకాశాలు ఇచ్చాయి.

పాల్గొన్న ప్రముఖ కంపెనీలు

పాల్గొన్న ప్రముఖ కంపెనీలు

యాక్సెంచర్, అల్వారెజ్ అండ్ మార్సల్, ఏటీ కిర్నె, బెయిన్ అండ్ కంపెనీ, మికెన్సీ, పీడబ్ల్యూసీ డీఐఏసీ, పీడబ్ల్యూసీ ఇండియా, రోలాండ్ బర్గర్, సిమెన్స్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్, అండ్ జెడ్ఎస్, డాల్ బెర్గ్, డెలాయిట్ ఇండియా, ఎర్నెస్ట్ అండ్ యంగ్ తదితర 314 కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చాయి.

ఐటీ అండ్ టెక్నాలజీ కంపెనీలు...

ఐటీ అండ్ టెక్నాలజీ కంపెనీలు...

ఐటీ, ఐటీఈఎస్, టెక్నాలజీ విభాగానికి చెందిన కంపెనీల్లో ఏడీపీ, అమెజాన్, బ్లాక్ బక్, బైజూస్, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్, ఫ్లిప్‌కార్ట్, గూగుల్, మీడియా నెస్ట్, ఇన్‌మోబి, మైక్రోసాఫ్ట్, ఎంఫిన్, మైంత్ర, నైకా, ఓలా, పేసేఫ్, ఫోన్ పే, రేజర్ పే, ఉబెర్, వీఎంఆర్, జొమాటో తదితర కంపెనీలు ఉన్నాయి.

బీఎఫ్ఎస్ఐ విభాగం

బీఎఫ్ఎస్ఐ విభాగం

బీఎఫ్ఎస్ఐ విభాగంలో యాక్సిస్ బ్యాంకు, సిటీ బ్యాంక్, క్రెడిట్ సూయిజ్, ఎస్టీ అడ్వైజర్, ఐసీఐసీఐ, మాట్రిక్స్ పార్ట్‌నర్స్, యస్ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ అండ్ ప్రయివేటు ఈక్విటీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, బార్ క్లేస్, కింగ్‌ఫిష్ ప్రయివేటు ఈక్విటీ, నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్(జీవోఐ), ఆర్బీఐస్, వాటర్ ఫిల్డ్ అడ్వైజర్స్, వెల్స్ ఫార్గో ఉన్నాయి.

FMCGలో

FMCGలో

FMCGలో విభాగంలో ఏబీ ఇన్ బెవ్, కోకాకోలా, కాల్గేట్, పాల్మోలివ్, గోద్రెజ్, హెచ్‌యూఎల్, నెస్లే, పీ అండ్ జీ, సాంసంగ్, ఐటీసీ, మారికో దేశీయ సంస్థల కంటే అంతర్జాతీయ సంస్థలలో చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. వీటిలో యాపిల్, డెలాయిట్, ఈవై, ల్యాండ్‌మార్క్ కూడా ఉన్నాయి.

English summary

ఒక్కో ఉద్యోగి సగటు వేతనం రూ.26.15 లక్షలు, 1,383 మంది విద్యార్థులకు ఆఫర్ | At ISB placements, 1382 job offers made to 890 students on Day 1

This year, despite the fear of economic slowdown affecting the campus placement, the average salaries offered has also gone up by 124 per cent. The average salary offered to PGP students was Rs 26.15 lakh per annum.
Story first published: Wednesday, December 4, 2019, 10:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X