For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూకే, భారత్ జీడీపీ కంటే ఆపిల్ ఇంక్ కంపెనీ మార్కెట్ క్యాప్ ఎక్కువ, అతి తక్కువ కాలంలో...

|

అమెరికా దిగ్గజం ఆపిల్ ఇంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ దేశాలన్ని మినహాయించి మిగతా అన్ని దేశాల జీడీపీ కంటే ఇది ఎక్కువ. అంటే యూకే, భారత్ జీడీపీ కంటే కూడా ఈ మార్కెట్ క్యాప్ ఎక్కువే. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను భారత జీడీపీ రూ.197 లక్షల కోట్లు. డాలర్ వ్యాల్యూలో చెప్పాలంటడే 2.7 ట్రిలియన్ డాలర్లు. అదే ఆపిల్ ఇంక్ మార్కెట్ క్యాప్ 3 ట్రిలియన్ డాలర్లు లేదా రూ.225 లక్షల కోట్లు.

ఆపిల్ ఇంక్

ఆపిల్ ఇంక్

ఆపిల్ ఇంక్ షేర్ ధర సోమవారం 2.5 శాతం ఎగబాకి 182.01 డాలర్ల వద్ద ముగిసింది. అయితే క్రితం సెషన్‌లో దాదాపు అంతేస్థాయిలో క్షీణించి 179.70 డాలర్లుగా నమోదయింది. సోమవారం 180 డాలర్లు దాటిన సమయంలో ఈ కంపెనీ 3 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటింది.

ఆపిల్ ఇంక్ చివరి త్రైమాసికంలో అన్ని రంగాల్లోను వృద్ధిని నమోదు చేసింది. ఏడాది ప్రాతిపదికన 29 శాతం వృద్ధి నమోదయింది. అయితే ఇప్పటికే ఐఫోన్ సేల్స్ ఈ కంపెనీకి అతిపెద్ద అసెట్‌గా ఉంది. ఆపిల్ సర్వీసెస్ బిజినెస్ ఏడాది ప్రాతిపదికన 25.6 శాతం ఎగిసింది. గత త్రైమాసికంలో 18 బిలియన్ డాలర్ల రెవెన్యూ వచ్చింది.

స్టాక్ పైన బుల్లిష్‌గానే

స్టాక్ పైన బుల్లిష్‌గానే

ఇన్వెస్టర్లు ఆపిల్ ఇంక్ స్టాక్ పైన బుల్లిష్‌గా ఉన్నారు. గత నాలుగేళ్ల కాలంలో ఈ స్టాక్ మూడింతలు పెరిగింది. ఏడాదిలో 40 శాతం మేర లాభపడింది.

మోర్గాన్ స్టాన్లీకి చెందిన కేటీ హుబెర్టీ డిసెంబర్ నెలలో ఆపిల్ ఇంక్ టార్గెట్ ధరను 164 డాలర్ల నుండి 200 డాలర్లకు పెంచింది. ఆపిల్ యాప్ స్టోర్ రెవెన్యూ అద్భుతమైన పనితీరును కనబరుస్తుందని అంచనా వేసింది. డిసెంబర్ నెలలో 83 మిలియన్ యూనిట్ల షిప్‌మెంట్స్ కనిపించాయి. ఇది అంచనాల కంటే 3 మిలియన్లు ఎక్కువ. ఆపిల్ 27 మిలియన్ల కొత్త ఎయిర్‌పాడ్స్ మోడల్స్‌ను విక్రయించింది.

తక్కువ కాలంలోనే..

తక్కువ కాలంలోనే..

ఆపిల్ మార్కెట్ క్యాప్ 2018 ఆగస్ట్ నెలలో తొలిసారి ఒక లక్ష కోట్ల డాలర్లను తాకింది. 2020 ఆగస్ట్ నెలలో 2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇప్పుడు మూడు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి ఎగబాకింది. తొలి లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్‌ను సాధించేందుకు 38 సంవత్సరాలు, 1 నుండి రెండు లక్షల కోట్ల డాలర్లకు చేరుకునేందుకు రెండు సంవత్సరాలు, రెండు నుండి మూడు లక్షల కోట్ల డాలర్లకు చేరుకునేందుకు 16 నెలలు మాత్రమే పట్టింది. ఆపిల్ ప్రస్తుతం ప్రపంచంలోకెల్ల అత్యంత విలువైన కంపెనీ. ఆ తర్వాత గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ 1.92 లక్షల కోట్ల డాలర్లు, సౌదీ ఆరామ్‌కో 1.9 లక్షల కోట్ల డాలర్లు, అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 1.73 లక్షల కోట్ల డాలర్లతో ఉన్నాయి.

English summary

యూకే, భారత్ జీడీపీ కంటే ఆపిల్ ఇంక్ కంపెనీ మార్కెట్ క్యాప్ ఎక్కువ, అతి తక్కువ కాలంలో... | At $3 trillion, Apple's market cap is higher than GDP of UK, India

Apple briefly hit a market cap of $3 trillion during intraday trading on Monday, before dropping back under the mark shortly afterwards. Apple broke the barrier when its share price hit $182.86.
Story first published: Wednesday, January 5, 2022, 8:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X