For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్, చైనా సహా విదేశాల నుండి రూ.4 లక్షల కోట్ల మేర తగ్గనున్న రెమిటెన్స్

|

కరోనా మహమ్మారి కారణంగా దాదాపు అన్ని దేశాల్లోను ఉపాధి అవకాశాలు పడిపోయాయి. ఉద్యోగాల కోత చోటు చేసుకుంది. వర్ధమాన దేశాల్లో ఈ పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. ఈ దేశాల నుండి విదేశాలకు వలస వెళ్లిన వారు అక్కడ సంపాదించి, ఎంతో కొంత మొత్తాన్ని తమ కుటుంబాల కోసం సొంత దేశానికి పంపిస్తారు. విదేశాలకు వెళ్లి తమ సంపాదనలో పెద్ద మొత్తాన్ని స్వస్థలాల్లోని తమ కుటుంబాలకు పంపడమే రెమిటెన్స్.

ఆదాయం తగ్గింది.. ఇలా చేస్తాం: కొత్త సవాళ్లు స్వీకరించేందుకు యంగ్ ఇండియా రెడీఆదాయం తగ్గింది.. ఇలా చేస్తాం: కొత్త సవాళ్లు స్వీకరించేందుకు యంగ్ ఇండియా రెడీ

రూ.4 లక్షల కోట్ల వరకు తగ్గొచ్చు

రూ.4 లక్షల కోట్ల వరకు తగ్గొచ్చు

ప్రపంచం మొత్తం మీద ఇలా వెళ్లే కార్మికుల్లో మూడోవంతు మంది ఆసియా - పసిఫిక్ దేశాల నుండే ఉంటారు. కరోనా వల్ల ఆసియా దేశాల్లో ఉపాధి, రాబడి తగ్గడంతో ఈసారి రూ.2.35 లక్షల కోట్ల నుండి రూ.4 లక్షల కోట్ల వరకు నగదు బదలీ ఆసియా పసిఫిక్ దేశాలకు తగ్గవచ్చునని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు అంచనా వేసింది. దీంతో పలు కుటుంబాలు పేదరికంలోకి జారిపోవచ్చునని పేర్కొంది. 2019లో ఈ దేశాలకు రూ.23.62 లక్షల కోట్ల (315 బిలియన్ డాలర్లు) నగదు బదలీ అయింది. ఈసారి రూ.4 లక్షల కోట్ల వరకు తగ్గవచ్చుననే అంచనాలు ఉన్నాయి.

2019లో టాప్ 10 దేశాల్లో భారత్, చైనా

2019లో టాప్ 10 దేశాల్లో భారత్, చైనా

ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడొంతుల మైగ్రేంట్ వర్కర్స్ ఆసియా పసిఫిక్ నుండి ఉన్నారు. రెమిటెన్స్ తగ్గనున్న నేపథ్యంలో ఈ ప్రభావం తగ్గించేందుకు ఆ మేరకు ప్రభుత్వాలు విధానపరమైన చర్యలు తీసుకోవాలని ఏడీపీ పేర్కొంది. ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో 91 మిలియన్ల మైగ్రేంట్ వర్కర్స్ వరకు ఉంటారు. 2019లో టాప్ 10 రెమిటెన్స్ దేశాల్లో భారత్, చైనా, పిలిప్పీన్స్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వియత్నాం, మనీలా ఉన్నాయి. రెమిటెన్స్ పంపించే దేశాల్లో టోంగా, సమోవా దేశాలు కూడా ఉన్నాయి. వారి జనాభాతో పోలిస్తే రెమిటెన్స్ ఎక్కువ.

వినియోగం, పెట్టుబడులు పెంచుతాయి

వినియోగం, పెట్టుబడులు పెంచుతాయి

సెంట్రల్ ఏషియా దేశాలైన జార్జియా, కిర్గిజ్ రిపబ్లిక్, తజకిస్తాన్‌ల నుండి సీజనల్, లాంగ్ టర్మ్ మైగ్రేంట్స్‌.. రష్యన్ ఫెడరేషన్, యూరోప్‌కు వెళ్తారు. వీటితో పాటు నేపాల్, పిలిప్పీన్స్ కూడా రెమిటెన్స్ పరంగా దెబ్బతిననున్నాయి. ఆయా కుటుంబాలకు స్థిర ఆదాయానికి రెమిటెన్స్ ఉపయోగపడతాయి. అలాగే పలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తదితర మార్గాల్లో ప్రయోజనకరం. సాధారణ వినియోగాన్ని, పెట్టుబడులను పెంచుతాయి. విదేశీ నిధులను సమకూర్చడం ద్వారా అప్పులపరంగాను ఉపయోగపడతాయి.

English summary

భారత్, చైనా సహా విదేశాల నుండి రూ.4 లక్షల కోట్ల మేర తగ్గనున్న రెమిటెన్స్ | Asia Pacific may see $31.4-54.3 billion remittance losses due to COVID-19: ADB

Asia Pacific, which accounts for a third of the global migrant workforce, is likely to face remittance losses of USD 31.4-54.3 billion due to the coronavirus pandemic, the Asian Development Bank (ADB) said in a report.
Story first published: Monday, August 10, 2020, 14:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X