For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

New Wage Code: ఉద్యోగులకు శుభవార్త.. కంపెనీ మారితే రెండు రోజుల్లో సెటిల్ చేయాలి.. కొత్త వేతన కోడ్..

|

New Wage Code: ఉద్యోగులకు గుడ్ న్యూస్. కొత్త వేతన కోడ్ ప్రకారం ఇకపై కంపెనీల ఆటలకు కేంద్రం చెక్ పెట్టింది. విషయం ఏమిటంటే.. కొత్తగా అమలులోకి వస్తున్న వేజ్ కోడ్ ప్రకారం ఎవరైనా ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీకి రాజీనామా చేసినా లేక ఉద్యోగం నుంచి తొలగించబడినా, కంపెనీ తన వ్యాపారాలను మూసివేసినా, ఉద్యోగి సేవల నుంచి తొలగించబడినా సదరు కంపెనీ ఉద్యోగి లాస్ట్ వర్కింగ్ డే(చివరి పనిదినం) నుంచి రెండు రోజుల్లోపు అతనికి వేతనాలు, బకాయిలు, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్‌ మెుత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం పాటిస్తున్న విధానం..

ప్రస్తుతం పాటిస్తున్న విధానం..

ప్రస్తుతం.. వ్యాపారాలు అనుసరిస్తున్న సాధారణ పద్ధతి ఏమిటంటే ఉద్యోగి చివరి పని దినం నుంచి 45- 60 రోజుల్లో వారికి అన్ని బకాయిలు, వేతనాలను చెల్లిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కంపెనీలు ఇందుకు 90 రోజుల గడువు తీసుకుంటున్నాయి. కొత్త సంస్కరణను ఇప్పటికే పార్లమెంటు ఆమోదించింది. నాలుగు లేబర్ కోడ్‌లు: వేతనం, సామాజిక భద్రత, కార్మిక సంబంధాలు, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులపై ఈ మార్పులు వచ్చాయి.

ఎప్పటి నుంచి అమలులోకి..

ఎప్పటి నుంచి అమలులోకి..

కేంద్ర ప్రభుత్వం జూలై 1 నాటికి ఈ కొత్త చట్టాలను అమలు చేయాలని కోరుతుండగా.. అనేక రాష్ట్రాలు ఈ నిబంధనలను ఇంకా ఆమోదించలేదు. రాజ్యాంగం ప్రకారం కార్మిక ఉమ్మడి జాబితాలో ఉన్నందున కార్యరూపం దాల్చటానికి అనుమతి తప్పనిసరి. ప్రస్తుతానికి, నాలుగు కార్మిక చట్టాలకు అవసరమైన చట్టాలను కొన్ని రాష్ట్రాలు ఇంకా ఏర్పాటు చేయలేదు.

అమలులోకి వస్తే..

అమలులోకి వస్తే..

వేజ్ కోడ్ అమలు చేయబడితే.. వ్యాపారాలు తమ పేరోల్ ప్రక్రియలను పునఃసమీక్షించవలసి ఉంటుంది. రెండు పని దినాల్లో వేతనాల పూర్తి పరిష్కారాన్ని పొందేందుకు సమయపాలన, విధానాలపై పని చేయాల్సి ఉంటుంది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వాలు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్ మెంట్ కాలక్రమాన్ని మార్చుకునేందుకు కోడ్ వెసులుబాటు కల్పించింది. అంటే రాష్ట్రాలు రెండు రోజుల గడువును అవసరమైతే పెంచేందుకు వీలు ఉంటుంది. కొత్త వేతన కోడ్‌లు పని గంటల మార్పులు, ప్రావిడెంట్ ఫండ్ విరాళాలు, ఉద్యోగుల చేతికి అందే వేతనాలపై కూడా కొన్ని మార్పులను తీసుకువచ్చింది. దీని వల్ల ఉద్యోగుల చేతికి అందే వేతనం తగ్గి భవిష్య నిధికి కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. పని వేళలు 12 గంటలకు పెరగనున్నాయి. ఇలా చేయటం వల్ల ఉద్యోగులకు మూడు వీక్లీ ఆఫ్‌లను అందించాలి. బేసిక్ శాలరీ మెుత్తం జీతంలో 50 శాతం ఉండాలి. కొత్త కార్మిక చట్టాల ప్రకారం.. పదవీ విరమణ కార్పస్, గ్రాట్యుటీ మొత్తం పెరుగుతుంది.

Read more about: new wage code jobs
English summary

New Wage Code: ఉద్యోగులకు శుభవార్త.. కంపెనీ మారితే రెండు రోజుల్లో సెటిల్ చేయాలి.. కొత్త వేతన కోడ్.. | as per New Wage Code companies should settle all dues to employees leaving organisation Within 2 Days after last working day

Salary, Full And Final Settlement Within 2 Days Says New Wage Code if employee leaving comapny or being removed from job
Story first published: Thursday, June 30, 2022, 13:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X