కరోనా వైరస్ లాంటి మహమ్మారిని గత 100 ఏళ్లలో ప్రజలు ఎప్పుడు ఎదుర్కొనలేదు. ప్రాణాంతకమైన ఈ వైరస్ బారిన పడి 3 లక్షల మంది ప్రాణాలొదిలేశారు. 50 లక్షల మందికి పైగా వైరస్ సోకి దానితో పోరాడుతున్నారు. ఇండియా లోనూ కేసుల సంఖ్య 1 లక్ష దాటిపోయింది. సుమారు 4,000 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు.
దీంతో ప్రజలు కేవలం వైరస్ పైన భయమే కాకుండా... దానిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉన్న మార్గాలపై అన్వేషిస్తున్నారు. వైరస్ బారిన పడకుండా ఉండాలంటే మనలో ఇమ్మ్యూనిటి పవర్ అధికంగా ఉండాలన్న సత్యాన్ని గుర్తించారు. దీంతో రోజువారీగా ఆహారంలో తీసుకునే పదార్థాలను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నారు. ఆయా పదార్థాల్లో విటమిన్ సి అధికంగా ఉండేవి సెలెక్ట్ చేసుకుంటున్నారు.
దీంతో దేశంలో లాక్ డౌన్ సమయంలో ఇమ్మ్యూనిటి పెంచే ఉత్పత్తుల అమ్మకాలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదం, యోగ, మెడిటేషన్ కు కూడా డిమాండ్ అధికంగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.

40% పెరిగిన అమ్మకాలు..
లాక్ డౌన్ సమయంలో రోగ నిరోధక శక్తి పెంచే ఆహారపదార్థాలు డిమాండ్ అధికంగా పెరిగింది. ముఖ్యంగా విటమిన్ సి ఉండే పదార్థాలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. దీంతో ఇండియా లో వీటి అమ్మకాలు సుమారు 40% పెరిగినట్లు ఫుడ్ రెగ్యులేటర్ ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారి ఒకరు వెల్లడించినట్లు ఈటీ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఫుడ్ లైసెన్స్ అనుమతులు ఇచ్చేందుకు ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అయన తెలిపారు.
అందులో ఈ ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. గూగుల్ నిర్వహించిన ఒక సర్వే లో కూడా ఆయుర్వేద, వంటింటి చిట్కాలు, విటమిన్ సి పదార్థాలు గురించి ఆన్లైన్ లో సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య ఏకంగా 6 రెట్లు పెరిగినట్లు తేలింది. ఈ పరిణామంతో దేశంలో ఆయుర్వేద ఉత్పత్తుల విక్రయాల్లో నిమగ్నమైన డాబర్ వంటి కంపెనీలకు ఎంతో కలిసొచ్చే అంశం. మారికో, విప్రో వంటి వినియోగ వస్తువుల కంపెనీలు కూడా లబ్ది పొందనున్నాయి. మరిన్ని బ్రాండెడ్ కంపెనీలు ఈ తరహా ప్రొడక్టులను అధికంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నాయి. ఒకప్పుడు పతంజలి దెబ్బకు ఎలా ఐతే అన్ని కంపెనీలు ఆయుర్వేద వైపు మళ్ళాయో .. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఒక వేవ్ రాబోతోంది అని విశ్లేషకులు చెబుతున్నారు.

టిక్ టాక్ కూడా కారణమే...
రోగనిరోధక శక్తిని పెంచే ఉత్పత్తుల పెరుగుదలకు వినియోగదారుల్లో పెరిగిన అవగాహనే ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇందుకు అత్యంత ప్రేక్షకాదరణ పొందిన టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి మొబైల్ ఆప్ లు కూడా తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. సోషల్ మీడియా లో వచ్చిన మెసేజ్ లు, సోషల్ సెలబ్రిటీ లు చెప్పే విషయాలను వారి ఫాలోవర్స్ పాటిస్తుండటంతో కూడా ఈ ప్రొడక్టుల సేల్స్ పెరుగుతున్నట్లు గుర్తించారు.
దీంతో ఈ సెగ్మెంట్ లో ఇప్పటికే పెద్ద బ్రాండ్లుగా ఉన్న కంపెనీలు అమ్మకాల్లో దూసుకుపోతుండగా.. కొత్త బ్రాండ్లు కూడా పుట్టుకొస్తున్నాయి. వచ్చే కొన్ని రోజుల్లో మార్కెట్లోకి మరిన్ని ఇమ్మ్యూనిటి బూస్టింగ్ ప్రోడక్టులు ప్రవేశించే అవకాశాలు అధికంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

అవే కొంటాం...
ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ నీల్సన్ నిర్వహించిన ఒక సర్వే లో కూడా వినియోగదారులు ఆరోగ్య ఉత్పత్తులు, వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులు, మెడిసిన్ వంటి వాటిపై అధికంగా డబ్బులు వెచ్చిస్తామని చెప్పారు. సర్వే లో పాల్గొన్న 56% మంది వినియోగదారులు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. చవాన్ ప్రాశ్, బ్రాండెడ్ హెల్త్ సాల్ట్ కు డిమాండ్ పెరుగుతోంది. హెల్త్ సప్లిమెంట్లు, హెల్త్ బార్లు అధికంగా కొనుగోలు చేస్తున్నారు.
అలాగే శానిటైజర్, ఫ్లోర్ క్లీనర్లు తయారు చేసే కంపెనీల సంఖ్య ఒక్క సారిగా పెరిగిపోయింది. సుమారు 152 కొత్త కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశించినట్లు తేలింది. విప్రో ఐతే ఏకంగా శానిటైజర్ కు బదులు ఒక స్ప్రే ను పరిచయం చేయబోతోంది. ఇలా మరిన్ని కంపెనీలు సరికొత్త ప్రొడక్టులతో మార్కెట్ ను ముంచెత్తనున్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications