For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా ఎఫెక్ట్: రష్యాతో చమురు యుద్ధం, భారీగా పడిపోయిన సౌదీ ఆరామ్‍‌కో షేర్లు

|

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 3,300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. దీంతో క్రూడాయిల్ ధరలు రోజు రోజుకు పడిపోతున్నాయి. కరోనా సహా వివిధ కారణాల వల్ల సౌదీ ఆరామ్‌కో షేర్ ధర మొదటిసారి ఐపీవో లెవల్ కంటే దిగజారింది. ఆరామ్‌కో లిస్ట్ అయినప్పటి నుండి జోరు కనిపించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తిరోగమనం ఎదుర్కొని రికార్డ్ షేర్ ధర నుండి భారీగా పడిపోయింది.

కస్టమర్లకు రిలయన్స్ జియో మరోసారి భారీ షాక్, త్వరలో టారిఫ్ పెంపు!కస్టమర్లకు రిలయన్స్ జియో మరోసారి భారీ షాక్, త్వరలో టారిఫ్ పెంపు!

ప్రారంభ ధర కంటే భారీగా పడిపోయిన షేర్

ప్రారంభ ధర కంటే భారీగా పడిపోయిన షేర్

సౌదీ ఆరామ్‌కో షేర్ ధర రియాద్‌లో ఆదివారం 6.4 శాతం మేర పడిపోయి 30.90 రియాల్స్‌కు చేరుకుంది. డిసెంబర్ నెలలో 32 రియాల్స్ ప్రారంభ ధర కంటే ఇది చాలా తక్కువ. సౌదీ కాలమానం ప్రకారం ఉదయం 11.23 సమయానికి 6.2 శాతం పడిపోయాయి. బెంచ్‌మార్క్ తాడావుల్ ఆల్ షేర్ ఇండెక్స్ 7.1 శాతం నష్టపోయింది.

ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయం..

ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయం..

ఇదిలా ఉండగా, గురువారం ఒపెక్ దేశాలు సమావేశమై చమురు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించాయి. 2020 చివరి వరకు 1.5 మిలియన్ బ్యారెళ్ళు లేదా 1.5 శాతం తగ్గించాలని నిర్ణయించాయి. గత డిసెంబర్‌లో నిర్ణయించిన చమురు ఉత్పత్తి కోతకు అదనంగా దీనిని నిర్ణయించారు.

చెక్ పెట్టిన రష్యా

చెక్ పెట్టిన రష్యా

అయితే ఒపెక్ దేశాలతో పాటు చమురు ఉత్పత్తిలో అతిపెద్ద దేశమైన రష్యా దీనికి అంగీకరించలేదు. దీంతో సౌదీకి ఇబ్బందికరంగా మారింది. చమురు బ్యారెల్‌కు 83 డాలర్ల ధర లభిస్తేనే ఆ దేశ బడ్జెట్ అంచనాలను అందుకుంటుంది. చమురు బ్యారెల్ ధర 43 డాలర్ల కంటే తగ్గితే రష్యా కూడా ఇబ్బందులు పడుతుంది.

ధరల పోరుకు సిద్ధమైన సౌదీ

ధరల పోరుకు సిద్ధమైన సౌదీ

బ్యారెల్ ధర 43 డాలర్ల కంటే తక్కువకు పడిపోతే రష్యా ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. దీంతో ఈ దేశం అంగీకరించలేదు. ఉత్పత్తి తగ్గింపు సాధ్యం కాకపోవడంతో సౌదీ అరేబియా ఉత్పత్తిని భారీగా పెంచి తీవ్రమైన ధరల పోరుకు తెరదీయాలని భావిస్తోందని తెలుస్తోంది.

రష్యాను ఇరుకున పెట్టే ప్లాన్

రష్యాను ఇరుకున పెట్టే ప్లాన్

రష్యాతో పోల్చుకుంటే సౌదీకి చమురు రవాణా మార్గాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ కారణంగా యూరప్, తూర్పు దేశాలు, అమెరికాలోని రిఫైనరీలకు తక్కువ ధరకే చమరును విక్రయించి ఆకర్షించాలని చూస్తోంది సౌదీ. అవసరమైతే 12 మిలియన్ బ్యారెళ్ల రికార్డ్‌కు చమురును ఉత్పత్తి చేయాలని చూస్తోంది. ప్రస్తుతం 9.7 మిలియన్ బ్యారెళ్లు ఉండగా, ఏప్రిల్ నాటికి 10 మిలియన్ బ్యారెళ్లకు చేరే అవకాశముంది. ఎక్కువ ఉత్పత్తి చేసి రష్యాను ఇరుకున పెట్టాలని చూస్తోంది. ఈ పోరు నేపథ్యంలో సౌదీ ఆరామ్‌కో షేర్లు భారీగా పడిపోయాయి.

English summary

కరోనా ఎఫెక్ట్: రష్యాతో చమురు యుద్ధం, భారీగా పడిపోయిన సౌదీ ఆరామ్‍‌కో షేర్లు | Aramco slumps below IPO price in blow to Saudi Post Oil Plan

Saudi Aramco shares dropped below their IPO level for the first time after oil collapsed and the energy giant kicked off a price.
Story first published: Sunday, March 8, 2020, 16:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X