For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Apple Hiring: ఆపిల్ ఉద్యోగాలు.. ఇండియాలో జోరుగా నియామకాలు.. పూర్తి వివరాలు..

|

Apple Hiring: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ విన్నా ఒకటే మాట ఆర్థిక మాంద్యం. ఈ తరుణంలో చాలా కంపెనీలు కఠినంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే ప్రఖ్యాత ఐఫోన్ తయారీ సంస్థ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.

తాజా నియామకాలు..

తాజా నియామకాలు..

యాపిల్ ఇంక్ భారతదేశంలోని తమ రిటైల్ దుకాణాల కోసం ఉద్యోగులను నియమించుకోవడం ప్రారంభించింది. ఈ ఏడాది మార్చిలో దేశ ఫైనాన్స్ హబ్ ముంబై నగరంలో 22,000 చదరపు అడుగుల్లో ఆపిల్ తన భారీ ఫ్లాగ్‌షిప్ రిటైల్ స్టోర్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది.

12 రకాల ఉద్యోగాలు..

12 రకాల ఉద్యోగాలు..

దేశంలో నూతన స్టోర్లను ఏర్పాటు చేస్తున్న ఆపిల్ మెుత్తం 12 వేర్వేరు విధుల కోసం ఉద్యోగులను నియమించుకుంటోంది. టెక్నికల్ స్పెషలిస్ట్, బిజినెస్ ఎక్స్‌పర్ట్, సీనియర్ మేనేజర్, స్టోర్ లీడర్, జీనియస్ సహా మరికొంత మందిని నియమించుకుంటోంది. సాధారణంగా Apple స్టోర్‌లో కనీసం 100 మంది ఉద్యోగులు ఉంటారు. అయితే ఫ్లాగ్‌షిప్ స్థానాల్లో 1000 మంది వరకు ఉద్యోగులు ఉండవచ్చని తెలుస్తోంది.

మార్కెట్ లీడర్..

మార్కెట్ లీడర్..

కంపెనీ ఉద్యోగులను నియమించుకుంటున్న వాటిలో "మార్కెట్ లీడర్" రోల్ కూడా ఉంది. ఈ స్థాయిలో ఎంపికైన వ్యక్తి "ఆపిల్ స్టోర్ల అంతటా" టీమ్‌లను నిర్వహించడంలో పాల్గొంటారు. ఈ క్రమంలో కంపెనీ లింక్డ్‌ఇన్‌లో ఇంకా ప్రకటించని ఓపెనింగ్స్ కోసం ముంబై, దిల్లీలో ఇప్పటికే 5 మంది ప్రకటించని స్టోర్ల కోసం నియమించబడ్డారని తెలుస్తోంది. కంపెనీ తన తాజా విస్తరణ ప్రణాళిక ద్వారా దేశంలో ఐఫోన్ ఉత్పత్తుల విక్రయాన్ని భారీగా పెంచేందుకు ఈ స్టోర్లను అందుబాటులోకి తెస్తోంది.

టాటా గ్రూప్..

టాటా గ్రూప్..

దీనికి ముందు టాటా గ్రూప్ దేశంలో ఐఫోన్ స్టోర్లను ఏర్పాటు చేసేందుకు ఆపిల్ సంస్థతో జతకట్టిందని గతంలో ప్రకటనలు వచ్చాయి. సంవత్సరాంతానికి.. ఆపిల్ ఇండియా "ఈ-కామర్స్ అమ్మకాలు, కనీసం రెండు ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లు, టాటాతో సంభావ్య భాగస్వామ్యంలో 10కి పైగా స్టోర్లు, స్టోర్లను కలిగి ఉండే "నాలుగు అంచెల వ్యూహాన్ని" కలిగి ఉండాలని చూస్తోంది. ఇది ఆర్థిక మందగమన సమయంలోనూ ఉపాధి అవకాశాల కల్పనతో యువతకు కొత్త అవకాశాలను తెస్తోంది.

Read more about: apple jobs recruitment business news
English summary

Apple Hiring: ఆపిల్ ఉద్యోగాలు.. ఇండియాలో జోరుగా నియామకాలు.. పూర్తి వివరాలు.. | Apple started Hiring Work force For it's retail stores in India

Apple started Hiring Work force For it's retail stores in India.
Story first published: Sunday, January 8, 2023, 12:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X