For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌లో భారీగా కరోనా: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ళ, టిమ్ కుక్ ప్రకటన

|

భారత్‌లో కరోనా కల్లోలం నేపథ్యంలో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు, సీఈవోలు స్పందిస్తున్నారు. అమెరికాలోని వాణిజ్య వర్గాలు భారత్‌కు అండగా ఉండేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. 40 కంపెనీల వరకు టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పడి భారత్‌కు సహకరించాలని నిర్ణయించాయి. ఆపిల్ సీఈవో టిమ్ కుక్ కూడా భారత్‌కు సాయమందిస్తామని ప్రకటించారు. కష్టకాలంలో ఉన్న భారతీయులకు సాయమందించేందుకు తమవంతు సహకారం ఉంటుందని తెలిపారు. క్షేత్రస్థాయిలోని మహమ్మారి నివారణకు జరుగుతున్న కార్యక్రమాలకు విరాళాల రూపంలో తమవంతు సహకారం ఉంటుందని టిమ్ కుక్ అన్నారు.

తొలిసారి టాస్క్‌ఫోర్స్, భారత్‌కు 40 దిగ్గజ కంపెనీల సహకారం: సీఈవోల కీలక నిర్ణయంతొలిసారి టాస్క్‌ఫోర్స్, భారత్‌కు 40 దిగ్గజ కంపెనీల సహకారం: సీఈవోల కీలక నిర్ణయం

సాయమందిస్తాం

సాయమందిస్తాం

భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని, డాక్టర్లు, కార్మికులు, ఆపిల్ కుటుంబం సహా భయంకరమైన ఈ వైరస్‌తో పోరాడుతున్న ప్రతి ఒక్కరి పైనే తమ ఆలోచనలు ఉన్నాయని, క్షేత్రస్థాయిలో సహాయక చర్యలకు మద్దతుగా ఆపిల్ విరాళం ఇస్తుందని టిమ్ కుక్ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఈ సాయం ఏ రూపంలో, ఎంత మొత్తం ఉంటుందనే విషయం వెల్లడించాల్సి ఉంది. స్వచ్ఛంద సంస్థలు లేదా ప్రభుత్వానికి నేరుగా విరాళం అందించడంపై సమాలోచనలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల..

సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల..

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో భారత సంతతికి చెందిన టెక్ కంపెనీల CEOలు ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశానికి అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. సహాయక చర్యల నిమిత్తం గూగుల్ తరఫున రూ.135 కోట్ల విరాళం అందిస్తున్నట్లు సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. భారత్‌లో పరిస్థితులను చూసి తన గుండె బద్దలైందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. సహాయక చర్యలకు తోడ్పడేలా ఆక్సిజన్ కాన్సంట్రేషన్ యంత్రాల కొనుగోలుకు చేయూతనిస్తామన్నారు.

భారీగా కేసుల నమోదు

భారీగా కేసుల నమోదు

భారత్‌లో ప్రతిరోజు లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజు మూడు లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వరుసగా ఐదో రోజు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తంగా దేశంలో 1.73 కేసులు నమోదు కాగా, 1.95 లక్షల మరణాలు నమోదయ్యాయి. కర్ణాటకలో నేడు ఒక్కరోజే 30000 కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో ఒకరోజులోనే అత్యధిక కేసులు నేడు నమోదయ్యాయి.

English summary

భారత్‌లో భారీగా కరోనా: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ళ, టిమ్ కుక్ ప్రకటన | Apple CEO Tim Cook pledges aid to India amid Covid 19 surge

Apple CEO Tim Cook has pledged aid to India as the Covid-19 crisis is deepening by the day. Cook said Apple will be donating to support and relief efforts on the ground. This comes soon after Google CEO Sundar Pichai and Microsoft CEO Satya Nadella announced their plans to support India and various Indian organisations in the fight against the outbreak.
Story first published: Tuesday, April 27, 2021, 22:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X