For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏపీలో అపోలో టైర్స్ ఉత్పత్తి ప్రారంభం: తొలి దశలో రూ.3,800 కోట్ల పెట్టుబడులు

|

అమరావతి: అపోలో టైర్స్ ఆంధ్రప్రదేశ్ యూనిట్ నుండి తొలి టైర్‌ను విడుదల చేశారు. 2018లో చిత్తూరు జిల్లా చినపాండూరులో అపోలో టైర్స్ పరిశ్రమ ఏర్పాటయింది. ఈ పరిశ్రమ నుండి వర్చువల్ సమావేసం ద్వారా చైర్మన్ దీనిని రెండు రోజుల క్రితం విడుదల చేశారు. ఏపీలో భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఉత్పత్తి మరింత పెంచుతామన్నారు. అపోలో టైర్స్‌కు ప్రపంచంలోని ఏడో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, భారత్‌లోని ఐదో యూనిట్ ఇది. దీని నుండి ఇప్పుడు ఉత్పత్తిని ప్రారంభించింది కంపెనీ.

లాక్‌‌డౌన్ దెబ్బతో రూ.1.2 లక్షల కోట్లు హుష్‌కాకి, ఉద్యోగాలు రావాలంటే..లాక్‌‌డౌన్ దెబ్బతో రూ.1.2 లక్షల కోట్లు హుష్‌కాకి, ఉద్యోగాలు రావాలంటే..

రూ.3,800 కోట్ల పెట్టుబడి

రూ.3,800 కోట్ల పెట్టుబడి

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం చిన్నపాండూరు గ్రామంలోని అపోలో టైర్స్ కంపెనీ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమైంది. 2018 జనవరిలో ఏర్పాటయిన ఈ అపోలో టైర్స్ ప్లాంట్ నుండి ఉత్పత్తి ప్రారంభం కావడం ఆనందంగా ఉందని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ట్వీట్ చేశారు. ఏపీలో గ్రీన్ ఫీల్డ్ పెసిలిటీలో భాగంగా మొదటి దశలో రూ.3,800 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు.

డిమాండ్ మేరకు..

డిమాండ్ మేరకు..

256 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిపాదించిన ఈ ప్లాంట్ రూ.1,800 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైంది. ఏడాదిన్నరలో రూ.3,800 కోట్ల పెట్టుబడితో పూర్తిస్థాయి ఉత్పత్తిని అందుకోనుంది. డిమాండ్‌కు అనుగుణంగా రానున్న 12 నెలల నుండి 18 నెలల కాలంలో దీనిని పెట్టుబడిని, సామర్థ్యాన్ని పెంచుతారు. డిమాండ్ మేరకు 2022 నాటికి రోజుకు 15,000 ప్యాసింజర్ కార్ల టైర్లు, 3వేల ట్రక్, బస్సు రేడియల్స్‌ను ఉత్పత్తి చేయనుంది.

మరిన్ని పెట్టుబడులు పెడతాం

మరిన్ని పెట్టుబడులు పెడతాం

భవిష్యత్తులో రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడతామని చైర్మన్ ఓంకార్ ఎస్ కన్వర్ అన్నారు. రాబోయే రోజుల్లో ఉత్పత్తిని పెంచుతామని తెలిపారు. మా వృద్ధి, ఉత్పత్తి సామర్థ్యం అల్ట్రా మోడర్న్ ఫెసిలిటీతో కూడుకున్నవని, టైర్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో అత్యుత్తమ టెక్నాలజీని ఉపయోగించే ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నామని తెలిపారు. ఐటీ డ్రైవెన్ సిస్టమ్స్, రోబోటిక్స్ టెక్నిక్స్‌తో పాటు యువకులు, నైపుణ్యం ఉన్న వారికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఇందులో 850 మంది ఉద్యోగులు ఉన్నారు.

English summary

ఏపీలో అపోలో టైర్స్ ఉత్పత్తి ప్రారంభం: తొలి దశలో రూ.3,800 కోట్ల పెట్టుబడులు | Apollo Tyres commissions new facility in Andhra Pradesh, to invest Rs 4,000 crore

Apollo Tyres commissioned its seventh manufacturing unit globally and the fifth in India with the first tyre rolling out on Thursday from the Andhra Pradesh greenfield facility in southern India.
Story first published: Monday, June 29, 2020, 13:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X