For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్టుబడిదారులకు జగన్ ప్రభుత్వం శుభవార్త, వేలకోట్ల పెట్టుబడులు, వేలాదిమందికి ఉద్యోగాలు

|

వైసీపీ ప్రభుత్వం తీరుతో పెట్టుబడులు వెనక్కి వెళ్లేలా ఉన్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే జగన్ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడంపై మరింతగా దృష్టి సారించింది. నాలుగు రోజుల క్రితం ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (SIPC) సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది. పరిశ్రమలు కొత్త యూనిట్లు ఏర్పాటు చేయడానికి రావడం, అవసరమైన మౌలిక సదుపాయాలు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందించే అంశంపై చర్చించారు. వివిధ సంస్థల నుండి పెట్టుబడుల ప్రతిపాదనలపై కూడా చర్చ జరిగింది.

భారీగా తగ్గిన బంగారం ధర, హైదరాబాద్‌లో ఎంతంటే?భారీగా తగ్గిన బంగారం ధర, హైదరాబాద్‌లో ఎంతంటే?

పెట్టుబడులు.. ఉద్యోగా, ఉపాధి

పెట్టుబడులు.. ఉద్యోగా, ఉపాధి

SIPC రాష్ట్రంలో దాదాపు రూ.18,000 కోట్ల విలువైన 25 భారీ ప్రాజెక్టుల ప్రతిపాదనకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనలు అమలులోకి వస్తే దాదాపు 47వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), ఎలక్ట్రానిక్స్, తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పలు కంపెనీలకు కొత్త పారిశ్రామిక విధానం ప్రకారం రాయితీలు ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ కంపెనీతో 10వేల ఉద్యోగాలు

ఈ కంపెనీతో 10వేల ఉద్యోగాలు

హాంగ్‌కాంగ్‌కు చెందిన ఇంటిలిజెంట్ సెజ్ సంస్థ చిత్తూరు జిల్లాలో రూ.700 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆడిదాస్ పాదరక్షల తయారీ యూనిట్‌కు SIPC ఆమోదం తెలిపింది. ఈ యూనిట్ ద్వారా దాదాపు 10వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఇదే ఇంటిలిజెంట్ సంస్థ గతంలో నెల్లూరులో అపాచీ సెజ్‌ను ఏర్పాటు చేసింది.

విశాఖల టైర్ల కంపెనీ

విశాఖల టైర్ల కంపెనీ

జపాన్ ఓ టైర్స్ గ్రూప్ రూ.1,600 కోట్లను విశాఖలో ఇన్వెస్ట్ చేయనుంది. ఈ టైర్ల తయారీ యూనిట్‌కు SIPC ఆమోదం తెలిపింది. రైతులు, అటవీ, గనుల తవ్వకాల్లో వినియోగించే వినియోగించే వాహనాలకు సంబంధించిన టైర్లు ఎక్కువగా తయారవుతాయి. ఈ కంపెనీతోను వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు

వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు

ఆదిత్య గ్రూప్‌కు చెందిన గ్రాసీమ్ ఇండస్ట్రీస్ తూర్పు గోదావరి జిల్లాలో రూ.2,700 కోట్లతో కాస్టిక్ సోడా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దీనికి ఆమోదం లభించింది. దీంతో 1,300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

భారీ పెట్టుబడి.. ఉద్యోగాలు

భారీ పెట్టుబడి.. ఉద్యోగాలు

చిత్తూరు జిల్లాలో టీసీఎల్ టెక్నాలజీ, రేణిగుంట సమీపంలోని ఈఎంసీ 1, 2లో మొబైల్ తయారీ కంపెనీలకు చెందిన వివిధ ప్రతిపాదనలకు SIPC ఆమోదం తెలిపింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో మూడున్నర వేల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తుండగా, 32 వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి లభించనుంది.

English summary

పెట్టుబడిదారులకు జగన్ ప్రభుత్వం శుభవార్త, వేలకోట్ల పెట్టుబడులు, వేలాదిమందికి ఉద్యోగాలు | AP SIPC new industrial policy to drag investments

The State Investment Promotion Committee (SIPC) discussed the contours of the new industrial policy in a meeting chaired by chief secretary Nilam Sawhney at the Secretariat.
Story first published: Tuesday, March 10, 2020, 15:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X