For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అన్నీ ఇచ్చాం: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం షాక్, కొత్త పథకాలతో రెవెన్యూ లోటు పెంచారు!

|

అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రం సహకారంతో ముందుకు సాగే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా రెవెన్యూ లోటును భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కోరుతోంది. తాజాగా, మంగళవారం రాజ్యసభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ రెవెన్యూ లోటుపై మాట్లాడారు.

తొలిసారి జగన్ స్కీం: రోజుకు రూ.225, డబ్బులు అందకుంటే..తొలిసారి జగన్ స్కీం: రోజుకు రూ.225, డబ్బులు అందకుంటే..

కొత్త పథకాలతో రెవెన్యూ లోటు పెంచారు

కొత్త పథకాలతో రెవెన్యూ లోటు పెంచారు

విభజన తర్వాత తొలి ఏడాదిలో ఏపీ ప్రభుత్వానికి వచ్చిన రెవెన్యూ లోటు రూ.4,117.89 కోట్లు అన్నారు. ఇందులో రూ.3,979.50 కోట్లు కేంద్రం ఇప్పటికే విడుదల చేసినట్లు తెలిపారు. అయితే కొత్త పథకాలను ప్రారంభించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ లోటును రూ.13,872.44 కోట్లకు పెంచినట్లు కాగ్ తమ దృష్టికి తెచ్చిందన్నారు.

దాదాపు అన్నీ ఇచ్చేశాం

దాదాపు అన్నీ ఇచ్చేశాం

2014-15లో ఏపీకి తలెత్తిన రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని విభజన సమయంలో హామీ ఇచ్చారని, ఇప్పటికో లోటు భర్తీకి చెందిన నిధులను కేంద్రం విడుదల చేయలేదని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు అనురాగ్ ఠాకూర్ స్పందించారు. 4వేల కోట్లకు గాను మూడువేల తొమ్మిది వందల కోట్లు ఇచ్చినట్లు చెప్పారు.

ఏపీ, తెలంగాణలకు ఆ నిధులూ ముట్టజెప్పాం

ఏపీ, తెలంగాణలకు ఆ నిధులూ ముట్టజెప్పాం

అలాగే, ఏపీ విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏడాదికి రూ.350 కోట్ల చొప్పున మూడేళ్లలో రూ.1,050 కోట్లు, తెలంగాణకు రూ.450 కోట్ల చొప్పున నాలుగేళఅలలో రూ.1,800 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.

జీఎస్టీ నిధులపై విజయసాయి రెడ్డి

జీఎస్టీ నిధులపై విజయసాయి రెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీకీ రావాల్సిన రెవెన్యూ లాస్ కంపన్షేషన్ ఆలస్యమవుతోందని రాజ్యసభలో లేవనెత్తారు. ఈ ఏడాది ఆగస్ట్ నెల వరకు ఏపీ జీఎస్టీ ఆదాయ నష్టాన్ని చూస్తోందని, జీఎస్టీ రెవెన్యూ లాస్‌ను రూ.1,605 కోట్లుగా అధికారులు లెక్కించారన్నారు. జీఎస్టీ నష్టాన్ని రెండు నెలలకు ఓసారి కేంద్రం విడుదల చేయడం తప్పనిసరి అన్నారు. ఆగస్ట్, సెప్టెంబర్ నెలలకు గాను అక్టోబర్‌లో చెల్లించాల్సిన నష్టపరిహారం ఇంకా చెల్లించలేదన్నారు. అక్టోబర్, నవంబర్ నిధులు కూడా డిసెంబర్ వరకు చెల్లించాల్సి ఉందన్నారు.

English summary

అన్నీ ఇచ్చాం: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం షాక్, కొత్త పథకాలతో రెవెన్యూ లోటు పెంచారు! | AP MP raises in Rajya Sabha delay in GST revenue loss compensation and Revenue loss

The YSR Congress Party (YSRCP) on Tuesday voiced concern over the delay by the Centre in paying Andhra Pradesh the guaranteed compensation for its Goods and Services Tax (GST) revenue loss for August-September.
Story first published: Wednesday, December 11, 2019, 16:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X