For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Budget 2023: ఈ రంగంలో పుష్కలంగా ఉద్యోగాలు..! కేంద్రం కొత్త ప్రణాళిక వివరాలు..

|

Budget 2023: కొత్త ఏడాది రాబోతున్న కొత్త బడ్జెట్ పై చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. కేంద్రం కురిపించే వరాల జల్లుపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో కొత్త ఉద్యోగాల కల్పనపై కూడా చాలా మంది ఆశ పెట్టుకున్నారు.

ఈ రంగాల్లో ఉద్యోగాలు..

ఈ రంగాల్లో ఉద్యోగాలు..

సినిమా తర్వాత.. ఇప్పుడు దేశంలోని యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్(AVGC) రంగంలో ప్రపంచంలోనే సాఫ్ట్ పవర్‌గా ఎదగాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. దీని వల్ల ఈ రంగాల్లో కొత్త ఉద్యోగాలు రానున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలో AVGC XR కమిషన్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఈ రంగం మొత్తం అభివృద్ధి, ప్రమోషన్ కోసం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన AVGC టాస్క్ ఫోర్స్ ద్వారా కమిషన్ ఏర్పాటుకు సిఫార్సు చేయబడింది. తరహాలో 'క్రియేట్ ఇన్ ఇండియా' ప్రచారాన్ని ప్రారంభించాలని కూడా సిఫార్సు చేసింది.

భారీ మార్కెట్..

భారీ మార్కెట్..

AVGC రంగంలో వృద్ధికి అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని భారత్ ప్రయత్నిస్తోంది. అందుకే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సంవత్సరం తన బడ్జెట్‌లో రంగాన్ని గుర్తించడం, ప్రోత్సహించడం గురించి మాట్లాడటం ప్రస్తావించదగినది. ప్రపంచంలో భారత్ ఈ రంగంలో కేవలం 1 శాతం వాటాను కలిగి ఉంది. రానున్న 10 ఏళ్లలో 6-7 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోవాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది.

లక్షల కోట్ల మార్కెట్..

లక్షల కోట్ల మార్కెట్..

ప్రస్తుతం ఈ రంగం దేశంలో 16-17 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా AVGC మార్కెట్ దాదాపుగా 350 బిలియన్ డాలర్లుగా ఉంది. అందుకే ఈ రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవటం ద్వారా భారత్ రానున్న కాలంలో సాఫ్ట్ పవర్ గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐటీ తర్వాత ఏవీజీసీ అభివృద్ధి చెందుతున్న రంగంగా ఉంది. ప్రస్తుతం ఈ రంగం దేశంలో ఒకటి నుండి 1.25 లక్షల ఉద్యోగాలను కల్పిస్తోందని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర వెల్లడించారు.

విద్యా విధానంలో మిళితం..

విద్యా విధానంలో మిళితం..

భవిష్యత్తులో ఈ రంగంలో ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్య స్థాయి నుంచి కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యా విధానంలో దీనిని భాగస్వామిగా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం అనేక ప్రైవేట్ విద్యాసంస్థలు వీటికి సంబంధించిన సబ్జెక్టులను బోధిస్తున్నాయి. అయితే దీనిని అధికారిక విద్యతో అనుసంధానించడానికి ప్రభుత్వం CBSE-NCERTని సంప్రదిస్తుండగా, మరోవైపు UGC, AICTE ద్వారా ఉన్నత విద్యామండలి ఆమోదాన్ని పొందుతోంది.

మెడికల్ అండ్ ఇంజనీరింగ్ తరహాలో..

మెడికల్ అండ్ ఇంజనీరింగ్ తరహాలో..

ఇక్కడ మెడికల్ అండ్ ఇంజినీరింగ్ తరహాలో AVGC సెక్టార్‌లో కెరీర్‌ల కోసం ఇది ప్రత్యేకమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించగలదని టాస్క్‌ఫోర్స్ విశ్వసిస్తోంది. ముఖ్యంగా.. హాలీవుడ్‌తో సహా పాశ్చాత్య ప్రపంచంలోని అన్ని చలనచిత్రాలు, టీవీ ప్రొడక్షన్‌లకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు భారతదేశంలో జరుగుతున్నాయి లేదా భారతీయులు చేస్తున్నారు. దీనిని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వం వేగంగా అడుగులు వేయాలని నిర్ణయించింది.

English summary

Budget 2023: ఈ రంగంలో పుష్కలంగా ఉద్యోగాలు..! కేంద్రం కొత్త ప్రణాళిక వివరాలు.. | Animation and gaming sectors may create new jobs with union government 2023 budget plan

Animation and gaming sectors may create new jobs with union government 2023 budget plan
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X