For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోర్టు ఫీజుల కోసం నగలు అమ్ముకున్నా ,సాధారణంగా బతుకుతున్నా : అనీల్ అంబానీ సంచలనం

|

పారిశ్రామిక రంగంలో ఆసియాలో అపరకుబేరుడిగా ఉన్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సోదరుడు, అనీల్ అంబానీ తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు. మూడు చైనా బ్యాంకుల రుణాలు ఎగవేత కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూకే కోర్టు విచారణకు హాజరైన అనిల్ అంబానీ చెప్పిన విషయాలు ప్రస్తుతం పారిశ్రామిక వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తాను పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయానని, నష్టాలలో కూరుకుపోయానని, కేవలం ఒకే ఒక కారు తో సాధారణ జీవితం గడుపుతున్నానని ఆయన కోర్టు ముందు వాపోయారు. తన దగ్గర ఏమీ లేవంటూ మరోమారు చేతులెత్తేశారు అనీల్ అంబానీ.

అనీల్ అంబానీ నుండి రుణాల వసూలుకు యూకే కోర్టును ఆశ్రయించిన మూడు బ్యాంకులు

అనీల్ అంబానీ నుండి రుణాల వసూలుకు యూకే కోర్టును ఆశ్రయించిన మూడు బ్యాంకులు

రిలయన్స్ టెలికాం వ్యాపారం కోసం మూడు చైనా బ్యాంకు నుండి 700 మిలియన్ డాలర్ల రుణానికి వ్యక్తిగత హామీ ఇచ్చారు అనిల్ అంబానీ. అయితే రిలయన్స్ టెలికాం దివాలా తీయడంతో ఆయన దాన్ని తిరిగి చెల్లించలేక పోయారు. దీంతో ఆ బ్యాంకులు అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయించాయి. జూన్ 12వ తేదీలోపు మూడు చైనా బ్యాంకులకు 5,281 కోట్ల రుణాన్ని, ఏడు కోట్ల రూపాయల చట్టపరమైన ఖర్చులను చెల్లించాలని మే 22న కోర్టు ఆదేశించింది. లేదా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన ఆస్తుల అఫిడవిట్ ను ప్రకటించాలని కోర్టు కోరింది.

సాధారణంగా జీవిస్తున్నానన్న అనీల్ అంబానీ

సాధారణంగా జీవిస్తున్నానన్న అనీల్ అంబానీ

అనిల్ అంబానీ రుణ బకాయిలు చెల్లింపు చేయడంలో విఫలం కావడంతో మరోమారు మూడు బ్యాంకులు యూకే కోర్టును ఆశ్రయించాయి. మూడు బ్యాంకులకు రుణాల ఎగవేతపై తాజా విచారణలో భాగంగా యూకే కోర్టు అంబానీ లగ్జరీ కార్లను మెయింటెన్ చేస్తున్నారని , ఆయన లగ్జరీ కార్ల సముదాయం గురించి ప్రశ్నించింది . అయితే అందుకు అనిల్ అంబానీ తాను సాధారణ మనిషిగా జీవిస్తున్నాను అని, తన వద్ద కేవలం ఒక్క కార్ మాత్రమే ఉందని, రోల్స్ రాయిస్ కారు తనకు లేనే లేదంటూ కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం తన ఖర్చులను సైతం కుటుంబ సభ్యులే భారిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు అనిల్ అంబానీ.

 భార్య నగలు అమ్మి కోర్టు ఖర్చులు భరిస్తున్నానని సంచలనం

భార్య నగలు అమ్మి కోర్టు ఖర్చులు భరిస్తున్నానని సంచలనం

తన భార్య నగలు అమ్మి కోర్టు ఖర్చులు భరిస్తున్నానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020 జనవరి జూన్ మధ్య కాలంలో చట్టపరమైన ఖర్చులకోసం 9.9 కోట్ల రూపాయలను ఆయన కోర్టుకు తెలిపారు. తన తల్లికి ఐదు వందల కోట్ల రూపాయలు, కుమారుడు అన్మోల్ కు 310 కోట్ల రూపాయలు బాకీ ఉన్నానని అనిల్ అంబానీ పేర్కొన్నారు. ఇదే సమయంలో టీనా అనిల్ అంబానీ కలెక్షన్ గురించి బ్యాంకుల తరపున వాదిస్తున్న కౌన్సిల్ ప్రశ్నించింది. అయితే అదంతా టీనాకు సంబంధించిందని, నా భర్తగా మాత్రమే తన పేరు ఉందని చెప్పుకొచ్చారు అనిల్ అంబానీ.

ఆర్ధిక సంక్షోభం కారణంగా ఆదాయం లేదన్న అనీల్ అంబానీ

ఆర్ధిక సంక్షోభం కారణంగా ఆదాయం లేదన్న అనీల్ అంబానీ

ఆర్థిక సంక్షోభం కారణంగా ఆదాయం లేదని, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా 2019 2020లో ఎటువంటి ఆదాయం రాలేదని ఆయన కోర్టుకు తెలిపారు. అనిల్ అంబానీ చాలా లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నారని, ఆయనకు ప్రైవేట్ హెలికాఫ్టర్ ఉందని, భార్యకు బహుమతిగా ఇచ్చిన ప్రైవేటు లగ్జరీ యాచ్ట్ అంశాలను ప్రస్తావించగా అనిల్ అంబానీ ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అయితే బ్యాంకుల తరఫున కేసు వాదిస్తున్న కౌన్సిల్ సభ్యుడు బంకిమ్ థంకీ క్యూసీ బ్యాంకులకు రావలసిన రుణ బకాయిలను చట్టపరమైన మార్గాల ద్వారానే తిరిగి పొందుతామని పేర్కొన్నారు.

English summary

కోర్టు ఫీజుల కోసం నగలు అమ్ముకున్నా ,సాధారణంగా బతుకుతున్నా : అనీల్ అంబానీ సంచలనం | anil ambani sensation on his life style .. sold jewelery for court fees

Former billionaire Anil Ambani rejected a judge’s comment that he lived a “lavish lifestyle" as he faced questions about his assets from lawyers acting for a trio of Chinese banks.He told the court that he sold her wife's jewelery and paying court fees.
Story first published: Saturday, September 26, 2020, 15:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X