For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వారికి షాకిచ్చిన జగన్ ప్రభుత్వం: అమరావతిలో ఆ ప్లాట్ల కేటాయింపు రద్దు, కారణమిదే

|

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వారికి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం షాకిచ్చింది. అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వారికి ల్యాండ్ పూలింగ్ కింద CRDA కేటాయించిన ప్లాట్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. టీడీపీ హయాంలో ల్యాండ్ పూలింగ్ చట్టం 2015 కింద అమరావతికి 34వేల ఎకరాల వరకు సేకరించారు. ల్యాండ్ పూలింగ్ నేపథ్యంలో దీనికి దులు రిటర్నబుల్ ప్లాట్స్ కేటాయించింది గత ప్రభుత్వం. దీనిని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది.

మందగమనం ఎఫెక్ట్, తెలంగాణలో భూముల విలువ పెంపు?మందగమనం ఎఫెక్ట్, తెలంగాణలో భూముల విలువ పెంపు?

ఎందుకు రద్దు చేసింది?

ఎందుకు రద్దు చేసింది?

గత ప్రభుత్వ హయాంలో ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చిన వారికి ఈ ప్లాట్లు కేటాయించారు. అయితే పేదలకు మంజూరు చేసిన అసైన్డ్ భూములను కొందరు రాజకీయ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారని, వాటిని వాటిని సీఆర్డీఏ సమీకరించి బదులుగా ఆ నాయకులకే వాణిజ్య, నివాస స్థలాలకు కేటాయించిందని ఆరోపణలు ఉన్నాయి. అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం చట్ట విరుద్ధం. అలాగే, అసైన్డ్ భూములు సేకరించి బదులుగా వారికి ప్లాట్లు కేటాయించడం కూడా సరికాదని ప్రస్తుత ప్రభుత్వం వాదన. అందుకే ఈ ప్లాట్లు రద్దు చేసింది.

భూమికి బదులు ప్లాట్

భూమికి బదులు ప్లాట్

ల్యాండ్ పూలింగ్ కింద మెట్ట ప్రాంతంలో ఎకరా భూమి తీసుకుంటే 500 గజాల నివాస స్థలం, 50 గజాల కమర్షియల్ ప్లాట్, జరీబు భూములు అయితే 500 గజాల నివాస స్థలం, 100 గజాల కమర్షియల్ ప్లాట్ ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేటాయింపులను ఇటీవల కేబినెట్ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో అసైన్డ్ ల్యాండ్స్ కొనుగోలు చేసిన వారికి CRDA కేటాయించిన ప్లాట్లను రద్దు చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి శ్యామల రావు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు.

వారికి కేటాయిస్తారా?

వారికి కేటాయిస్తారా?

అసైన్డ్ భూములు, రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో ఫిర్యాదులు అందటంతో అమరావతిలోని అసైన్డ్ భూముల అనధికార క్రయ విక్రయాలపై ప్రభుత్వం విచారణ జరిపింది. దాదాపు 300 ఎకరాల అసైన్డ్ భూములను అనర్హులు కొందరు... సాగుదారుల నుంచి భూమి కొనుగోలు చేసి సీఆర్డీఏకు పూలింగ్ కింద ఇచ్చి రిటర్నబుల్ ప్లాట్స్ పొందినట్లుగా తేలింది. వీరు పొందిన రిటర్నబుల్ ప్లాట్స్ విస్తీర్ణం దాదాపు 34 ఎకరాల వరకు ఉంటుందట. వీటిని గతంలో సాగు చేసిన అసలైన అసైన్డ్ రైతులకు లేదా వారి వారసులకు నిబంధనల మేర కేటాయించాలని ప్రభుత్వం చూస్తోందని తెలుస్తోంది.

English summary

వారికి షాకిచ్చిన జగన్ ప్రభుత్వం: అమరావతిలో ఆ ప్లాట్ల కేటాయింపు రద్దు, కారణమిదే | Andhra Pradesh government cancels unethical allocation of assigned plots to commercial purpose

The government has rescinded the plots allotted by the CRDA under land pooling for those who have bought assigned lands in contravention of the provisions of capital Amaravati.
Story first published: Thursday, December 19, 2019, 12:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X