For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్చ్... ఆదాయం లేదు ఖర్చూ లేదూ! 6 నెలల్లోనే భారీగా మించిన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు

|

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఖర్చులదీ అదే పరిస్థితి. రెవెన్యూ లోటు ఆరు నెలల్లోనే అంచనాలను మించింది. విభజన అనంతరం రాజధాని లేక, లోటు బడ్జెట్‌తో ఏపీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. ఏపీ ప్రభుత్వం తరఫున పలుమార్లు ఢిల్లీకి రాష్ట్రానికి సాయం చేయాలని కోరిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల జగన్ తన ఢిల్లీ పర్యటనలో ఆర్థిక పరిస్థితిని వివరించారు., 15వ ఫైనాన్స్ కమిషన్‌కు ప్రత్యేకో హోదాను గుర్తు చేశారు.

ఇదీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, అన్నీ తెలంగాణలోనే: 'తలసరి' లెక్క చెప్పిన జగన్ఇదీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, అన్నీ తెలంగాణలోనే: 'తలసరి' లెక్క చెప్పిన జగన్

ఆశాజనకంగా లేని ఆదాయం, ఖర్చు

ఆశాజనకంగా లేని ఆదాయం, ఖర్చు

ప్రస్తుతం ఏపీ ఆదాయం, ఖర్చు విషయంలో ఆర్థిక పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదట. ఏడాది కాలానికి రూపొందించిన అంచనాలతో పోల్చి అర్ధ సంవత్సర ఫలితాలను విశ్లేషిస్తే ఏ రంగంలోను కూడా సగం కూడా అందుకోలేదట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాలతో పోలిస్తే సాధించిన రెవెన్యూ ఆదాయం 29%. బడ్జెట్ మొత్తంలో చేసిన ఖర్చు కూడా 33 శాతాని కంటే తక్కువ ఉందట.

మినిమం కూడా ఖర్చు చేయలేని పరిస్థితి

మినిమం కూడా ఖర్చు చేయలేని పరిస్థితి

ట్యాక్స్ రెవెన్యూ, పన్నేతర ఆదాయం, కేంద్ర పన్నుల్లో వాటా.. ఇలా ఏ అంశంలోను ఆరు నెలల కాలంలో రావాల్సిన ఫలితాలు రాలేదని తెలుస్తోంది. ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య ఈ అర్ధ సంవత్సరంలో పెట్టుబడి వ్యయం అంచనాల్లో 10% మాత్రమే ఉంది. కొన్ని ప్రభుత్వ శాఖల్లో మినిమం కూడా ఖర్చు చేయని పరిస్థితులు నెలకొన్నాయని తెలుస్తోంది.

ఖర్చు అంచనా ఎంత, ఎంత చేసింది?

ఖర్చు అంచనా ఎంత, ఎంత చేసింది?

రెవెన్యూ ఖర్చు, పెట్టుబడి ఖర్చు, రుణాలు, అడ్వాన్స్ తిరిగి చెల్లింపులు, కేంద్రం నుంచి తీసుకున్న అప్పులకు సంబంధించి వాయిదాల చెల్లింపులు, ప్రజాపద్దు వాడకానికి సంబంధించిన నిధుల తిరిగి చెల్లింపు అన్నీ కలిపి ప్రభుత్వం చేసిన మొత్తమే ఖర్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చులను రూ.2,27,975 కోట్లు కాగా ఇందులో దాదాపు సగం వరకు చేయాల్సి ఉంటుంది. కానీ కేవలం రూ.75,409 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇది 33 శాతాని కంటే కాస్త ఎక్కువ.

ఆరు నెలల్లోనే భారీగా రెవెన్యూ లోటు

ఆరు నెలల్లోనే భారీగా రెవెన్యూ లోటు

ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటును రూ.1,778 కోట్లకు పైగా బడ్జెట్ సమయంలోనే అంచనా వేసింది. కానీ ఇది తొలి ఆరు నెలల్లోనే రూ.ఏడున్నర వేల కోట్లకు పైగా చేరుకుంది. మొదటి ఆరు నెలల్లో రెవెన్యూ ఆదాయం రూ.యాభై రెండున్నర వేలు ఉండగా, ఖర్చు అంతకంటే ఎక్కువ రూ.60 వేలకు పైగా ఉంది. ద్రవ్య లోటును రూ.15,842 కోట్లుగా లెక్కించారు.

English summary

ప్చ్... ఆదాయం లేదు ఖర్చూ లేదూ! 6 నెలల్లోనే భారీగా మించిన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు | Andhra Pradesh financial situation in this six months

Andhra Pradesh financial situation in six months of 2019-20 financial year. Revenue loss already crossed the government estimation.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X